నేడు నంద్యాల‌, వైయ‌స్ఆర్ జిల్లాల్లో సీఎం ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు నంద్యాల, వైయ‌స్ఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. నంద్యాల‌ జిల్లాలో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం వైయ‌స్ఆర్ కడప జిల్లాలోని పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల‌కు హాజ‌ర‌వుతారు. 

కొద్ది సేప‌టి క్రితం తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బ‌య‌ల్దేరారు. అక్కడి నుంచి అవుకు రెండో టన్నెల్‌ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేసి.. ఆ టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తారు. అనంత‌రం ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి, పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. 

నంద్యాల జిల్లా ప‌ర్య‌ట‌న అనంత‌రం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ జిల్లా క‌డ‌ప‌కు చేరుకోనున్నారు. కడపలో పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాల్లో పాల్గొంటారు. ద‌ర్గాలో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేస్తారు.  సాయంత్రానికి తాడేపల్లికి చేరుకుంటారు.

Back to Top