రేపు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (03.01.2023) తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప‌ర్య‌టిస్తారు. వైయ‌స్ఆర్ పెన్షన్‌ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటారు. 11.20 – 1.10 వరకు ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో వైయ‌స్ఆర్‌ పెన్షన్‌ కానుక పెంపుదల, లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం, అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top