భారీ వర్షాలు, వరద నష్టంపై క‌లెక్ట‌ర్ల‌తో సీఎం వీడియో కాన్ఫ‌రెన్స్‌

తాడేప‌ల్లి: భారీ వర్షాలు, వరద నష్టంపై నాలుగు జిల్లాల కలెక్టర్‌లతో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యం నుంచి వైయ‌స్‌ఆర్‌ కడప, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు. ప‌లు అంశాల‌పై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పురపాలక,పట్టణాభివృద్ది శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, జలవనరుల శాఖ స్సెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌.జవహర్‌ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌.రావత్, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ.కృష్ణబాబు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్‌ కే.కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top