తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ శుభ శ్రావణ మాసంలో, ప్రజలంతా భక్తి శ్రద్ధలతో శ్రీవరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి, అమ్మవారి ఆశీస్సులు పొందాలి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అందరికీ సకల సౌభాగ్యాలూ లభించాలని కోరుతూ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు. హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా.. ఇస్లాం మత పునరుజ్జీవానికి ప్రాణం పోసిన అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహర్రం. పవిత్ర యుద్దంలో వీర మరణం పొందిన ఇమాం హుస్సేన్ త్యాగం వెలకట్టలేనిది. ఈ పవిత్రమైన సంతాప దినాలు(పీర్ల పండుగ) రాష్ట్రంలో హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయి అంటూ అంతకుముందు సీఎం వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.