తాడేపల్లి: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం వైయస్ జగన్, వైయస్ భారతి దంపతులు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. ``ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలకు శుభం జరుగుతుందని పంచాంగం చెబుతుంది. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలు మన ప్రభుత్వానికి ఇంకా బలాన్ని ఇవ్వాలని, ఈ సంవత్సరం అంతా ప్రజలందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నా. ఉగాది వేడుకలకు హాజరైన అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, సోదరులు, మిత్రులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికి ఉగాది శుభాకాంక్షలు` తెలిపారు.