అమరావతి: కరోనా కట్టడి విషయంలో దేశమంతా ప్రశంసించేలా ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల సేవలు మరువలేవని ప్రశంసించారు. త్వరగా కేసులను గుర్తించడం, టెస్టులు చేయడం, ట్రిట్మెంట్ అందించడంతో చాలా మంది ప్రాణాలు కాపాడగలిగామని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్రంలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని, పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుందన్నారు. శుక్రవారం అసెంబ్లీలో సీఎం వైయస్ జగన్ కరోనా..ఆరోగ్యశ్రీ అంశాలపై సవివరంగా సభ్యులకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ముఖ్యమంత్రి ఏమన్నారంటే..
ఈ రోజు కోవిడ్, ఆరోగ్యశ్రీ అంశాలపై చాలా సుదీర్ఘంగా మంత్రి, ఎమ్మెల్యేలు చక్కగా మాట్లాడారు. కొన్ని విషయాలు సభ దృష్టికి తీసుకువస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో దాదాపుగా 8.76 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో రికవరీ అయిన వారు 856320 మంది, చనిపోయిన వారు 7014 మంది ఉన్నారు. ఇంకా యాక్టివ్‌గా ఉన్నవి 6742 కేసులు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఈ మాదిరిగా ఉందంటే..దేశంలో ఏమాదిరిగా ఉందని ఆలోచన చేయాలని గుర్తు చేస్తున్నాను. గత మార్చి నుంచి చూస్తే దాదాపు 9 నెలలు కరోనాతో యుద్ధం చేస్తున్నాం. 8.76 పాజిటివ్ కేసులు వచ్చాయంటే..ఇంత మంది రికవరీ అయ్యారంటే ఎంత ఎఫర్ట్, ఎనర్జీ పెట్టి ఉండాలి. ఏరకంగా డాక్టర్లు, నర్స్‌లు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పోలీసు వ్యవస్థకు ఎటువంటి కృతజ్ఞతలు చెప్పాలో..కలెక్టర్లు కూడా చాలా కష్టపడ్డారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఈ రోజుకు 6742 కేసులు కనిపిస్తున్నాయి. ఈ రోజు కూడా 7 నుంచి 8 మంది రోజు చనిపోతున్నారు. దాదాపుగా 800 కేసులు నమోదు అవుతున్నాయి. రోజుకు దాదాపు 70 వేల టెస్టులు చేస్తున్నాం. ఏప్రిల్ నుంచి కరోనాపై యుద్ధం చేస్తున్నాం. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రిటింగ్ అనే మూడు అంశాలపై పని చేశాం. ఇతర రాష్ట్రాల మాదిరిగా మనకు ఆసుపత్రులు లేవు. ఇటువంటి పరిస్థితిలో మనం ఎఫెక్టివ్‌గా కరోనాను కట్టడి చేయాలంటే టెస్టింగ్ ముఖ్యం. తొందరగా గుర్తిస్తే మనిషిని కాపాడుకోవచ్చు. ఈ సీక్రెట్‌తోనే రాష్ట్రంలో ఈ మేరకు ఫర్మామెన్స్ ఇవ్వగలిగాం. దేశస్థాయిలో ప్రశంసలు అందుకున్నాం. రాష్ట్రంలో మనం మొదలు పెట్టినప్పుడు ఒక్క ల్యాబ్ లేదు. ఈ రోజు 1,02,25,049 టెస్టులు చేశాం. దాదాపుగా 150 ల్యాబ్‌లు పని చేస్తున్నాయి. ఏపీలో 10 లక్షల జనాభాకు 1,91,560 టెస్టులు చేశాం. అంటే దాదాపుగా 19 శాతం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని గర్వంగా చెబుతున్నాను. ఏపీ ఇందులో మొట్ట మొదటి స్థానంలో ఉంది. మన పాజిటివ్ రేట్ యావరేజ్‌గా చూస్తే 8.5 శాతం కనిపిస్తుంది. 1.48 శాతం ఈ వారానికి కనిపిస్తుంది. అందరూ బాగా కష్టపడటం వల్ల 1.48 శాతానికి వచ్చాం. డెత్ రేట్ దేశంలో 1.6శాతం ఉంటే..మన రాష్ట్రంలో 0.8 ఉంది. దేవుడి దయంతో మరణాలు కట్టడి చేయగలిగాం. ఒకానొక రోజు వంద మంది ప్రతి రోజు చనిపోయేవారు. ఈ రోజు 7, 8 మంది చనిపోతున్నారు.
ఆసుపత్రుల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవు. కారణం ఏంటంటే ప్రభుత్వమే 243 కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో 21226 మంది డాక్టర్లను మనమే నియమించాం. 37,044 బెడ్స్, ఐసీయూ బెడ్స్ 4016, నాన్ ఐసీయూ బెడ్స్ 18,540 అందుబాటులోకి తీసుకువచ్చాం. నాన్ ఆక్సిజన్ బెడ్స్ 13 వేలు, వెంటిలెటర్స్ 4500 అందుబాటులో ఉన్నాయి. 104 నంబర్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఈ నెంబర్ కు ఫోన్ చేస్తే చాలు టెస్టింగ్ చేయడం నుంచి వైద్యం అందించి ఇంటికి పంపిస్తున్నాం. వాలంటీర్లు, ఆశా వర్కర్లు ఎంతో కష్టపడ్డారు. వీరికి మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 104 నంబర్‌కు ఫోన్ చేస్తే వారికి టెస్టులు చేయించడం, రిపోర్టు, వైద్యం అందించే వరకు బాధ్యత తీసుకున్నారు. కోవిడ్‌కు సంబంధించి ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ప్రతి ఆసుపత్రిలో రెడిమిసివియర్ ఇంజక్షన్ ఈ రోజుకు కూడా 30 డోస్‌లు ఇస్తున్నాం. ఒక్కో డోస్ రూ.5,500 విలువ చేస్తుంది. ఎవరికి బాగోలేకపోయినా కూడా రూ.17,000 విలువ చేసే ఇంజక్షన్ వేయిస్తున్నాం. కోవిడ్‌లో 85 శాతం ఇంట్లోనే ఎటువంటి వైద్యం లేకుండా చిన్న చిన్న మందులతో నయం అయ్యింది. 14 శాతం మంది మాత్రమే ఆసుపత్రికి వెళ్లారు. 1 శాతం మాత్రమే వెంటిలేటర్ వరకు వెళ్లి కొందరు మృత్యువాత పడ్డారు. ఇంట్లో వసతులు సరిగా లేకపోతే ..అలాంటి వారికి ప్రత్యేకంగా కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఈ రోజుకు నడుపుతున్నాం. వారికి మంచి ఆహారం, వైద్యం అందిస్తారు. నయం అయినతరువాత ఇంటికి పంపించారు. దేవుడి దయ వల్ల ఇవన్నీ చేయగలిగాం కాబట్టి వారికి కాపాడగలిగాం. ఈ రోజుకు ప్రతి ఆసుపత్రిలో సరిగ్గా పని చేస్తున్నారా? లేదా? రోగులను సరిగ్గా చూసుకుంటున్నారా? లేదా అన్నది తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.
టెలీ మెడిసిన్ 14410కు ఫోన్ చేస్తే వైద్య సేవలు అందించాం. ఎవరైనా ఫోన్ చేస్తే డాక్టర్ రిటర్న్ కాల్ చేస్తారు. వారికి హోం డెలివరీ ద్వారా మందులు అందజేశాం. దీనివల్ల మంచి జరిగింది. రెగ్యులర్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో 9,600 ఆసుపత్రులను ప్యాక్ చేసి , టెంపరరీగా నియామకాలు చేపట్టాం. దేవుడి దయ వల్ల ఇవన్నీ చేయగలిగాం.
వ్యాక్సిన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. వ్యాక్సిన్ ఎలా పంపిణీ చేయాలన్న దానిపై చర్చిస్తున్నాం. ఇంకా కొన్ని నెలల పాటు జాగ్రత్తగా ఉంటే ఈ గండం నుంచి బయటపడే అవకాశం ఉంది. అమెరికాలో మొన్న ఎన్నికలు జరిగాయి. ఈ రోజు అమెరికాలో రోజుకు 2 లక్షల కేసులు వస్తున్నాయి. రోజుకు 2 వేల మంది మృత్యువాత పడుతున్నారు. యూకే, ప్రాన్స్, ఇటవీ దేశాలు ఈ రోజు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చేందుకు మరో మూడు నెలలు పడుతుంది. వ్యాక్సిన్ వచ్చినా కూడా అందరికి పంపిణీ చేయడం అసాధ్యం. ఆరు కోట్ల జనాభాకు వ్యాక్సిన్ చేరాలంటే కొంత సమయం పడుతుంది. కోటి జనాభాకు వ్యాక్సిన్ ఇస్తామని కేంద్రం చెబుతోంది. చలి పెరిగే కొద్ది కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ఢిల్లీ, గుజరాత్, కేరళ రాష్టరాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గుజరాత్, మధ్య ప్రదేశ్‌లో రాత్రి కర్య్ఫ పెట్టారు. ఇంకా కొన్ని నెలలు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. బయటకు వెళ్లే సమయంలో మాస్క్‌లు పెట్టుకోవడం, భౌతిక దూరం ఉండటం, చేతులు శుభ్రం చేసుకోవడం అవసరం.
మరో మూడు నెలల్లో వ్యాక్సిన్ వస్తుందని కేంద్రం నుంచి సంకేతాలు ఉన్నాయి. కేంద్రం నుంచి సహాయ సహకారాలు అవసరం. వ్యాక్సిన్ పంపిణీ కోసం, స్టోర్ చేసుకునేందుకు ఈ మూడు నెలల్లో ప్రణాళిక రూపొందించుకోవాలి. దేవుడి దయ వల్ల ప్రతి గ్రామ సచివాలయంలో ఒక ఏఎన్ఎం ఉండటం ఊరటగా ఉంది. ఆశా వర్కర్లకు కూడా ఇంజక్షన్లు ఇచ్చేది నేర్పించాలి. మన రాష్ట్రానికి కోటి వ్యాక్సిన్లు ఇస్తామన్నారు. ఇందులో 3.6 లక్షలు హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ 7 లక్షలు ఉన్నారు. 50 ఏళ్లు పైబడిన వారు 90 లక్షల మంది ఉన్నారు. వీరికి మొదటి దశలో వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం గైడ్ లైన్ ఇచ్చింది. వ్యాక్సిన్ స్టోర్ చేసేందుకు ఫ్రీజర్స్, ప్రిజ్‌లు కావాలి. 2 డిగ్రి సెంటీగ్రేడ్ వాతావరణం అవసరం. ఇంజక్షన్ వేసే వారిని సిద్ధంగా ఉంచుకోవాలని కేంద్రం సూచించింది. 90 వేల మంది ఏఎన్ఎంలను పంపిణీకి సిద్ధం చేస్తున్నాం. ట్రాన్స్‌పోర్టు చేసేందుకు కూడా వాహనాలు సిద్ధం చేశాం.4065 కోల్డ్ చైన్ పరికరాలను రెడీ చేశాం. ప్రతి చోట టాస్క్‌పోర్స్‌ను సిద్ధం చేశాం. ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నాయి. నిద్ర లేకుండా పని చేస్తున్నాని చెప్పడం లేదు. ముఖ్యమంత్రిగా మానిటర్ చేయడం, అధికారులు అందరూ బాగా కష్టపడి పని చేస్తున్నారు.
ఆరోగ్యశ్రీ :
వైద్యం కోసం ఏ ఒక్కరూ కూడా అప్పుల పాలు కాకుండా ఉండేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఆయన కొడుకుగా ఈ పథకాన్ని నాలుగు అడుగులు ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తున్నా. ఆరోగ్యశ్రీ పరిధిని 1059 చికిత్సల నుంచి 2000 వ్యాధులకు మొదట పశ్చిమ గోదావరి జిల్లాలో అమలు చేశాం. నిరుడు ప్రారంభించిన ప్రాజెక్టు ఈ రోజు 2436 రోగాలకు పెంచుతూ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నాం. మన రాష్ట్రంలోనే కాదు..పక్క రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించాం. నెట్‌వర్క్ ఆసుపత్రులు 1400 ఉన్నాయి. ఈ ఆసుపత్రులకు సంబంధించిన బిల్లులు గ్రీన్ చానల్‌లో పెట్టాం. మూడు వారాల్లో బిల్లులు క్లియర్ అవుతున్నాయని గర్వంగా చెబుతున్నా. ఆరోగ్యశ్రీలో గొప్ప మార్పు చేశాం. ఆరోగ్య ఆసరా అనే పథకాన్ని ఏర్పాటు చేశాం. ఆపరేషన్ తరువాత ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకునే సమయంలో ప్రభుత్వం నెలకు రూ.5 వేల చొప్పున రూ.10 వేల అందజేస్తున్నాం. మరో గొప్ప మార్పు ఏంటంటే క్యాన్సర్, డయాలసిస్, సికిల్‌సెల్, బోదకాలు, పెరాలసిస్, సీవియర్ మస్క్యూలర్, కిడ్ని ట్రాన్స్‌ఫ్లాంట్ అయిన రోగులు, మల్టి డిఫాల్టింగ్ రోగులకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పింఛన్ ఇస్తున్నాం. లెప్రసీ రోగులకు కూడా రూ.5 వేలు నెల నెల పింఛన్ ఇస్తున్నాం. ఆసుపత్రుల గ్రేడింగ్ కోసం సిబ్బందిని నియమించాం. హెల్ప్ డెస్క్ పెట్టాం. డిసెంబర్ 10వ తేదీ కల్లా ఆరోగ్య మిత్ర అందుబాటులో ఉంటారు. గ్రామ సచివాలయంలో కూడా అందుబాటులో ఉంటారు. ఆరోగ్యశ్రీ రోగులను వీరు చిరునవ్వుతో ఇంటికి పంపించే వరకు బాధ్యత తీసుకుంటారు. ఆహారం బాగా పెడుతున్నారా? సౌకర్యాలు సరిగా ఉన్నాయని ఆరోగ్య మిత్రలు పర్యవేక్షిస్తారు.1068 కొత్త అంబులెన్స్‌లు ఒకేసారి ప్రారంభించాం. ఇటీవలే విజయవాడ నుంచి ఈ వాహనాలు కుయ్ కుయ్ అంటూ పల్లెలకు వెళ్లాయి. ఆసుపత్రి రంగాన్ని మార్చేందుకు నాడు-నేడు కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నాం. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ఈ క్లినిక్‌లో ఉంటారు. మందులు అక్కడే అందుబాటులో ఉంటాయి. విలేజ్ క్లినిక్ నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు మార్పులు చేయబోతున్నాం. ఇప్పటి వరకు 11 మెడికల్ కాలేజీలు ఉంటే..మనం మరో 16 మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ దేవుడి దయతో రూ.16 వేల కోట్లు ఖర్చు చేసి ఏపీలో ఏ ఒక్కరూ కూడా వైద్యం కోసం అప్పులపాలు కాకుండా చూసే కార్యక్రమం చేపట్టాం. దేవుడి దయతో ఇవన్నీ జరగాలని కోరుకుంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ముగించారు.