తాడేపల్లి: వైయస్‌ఆర్ ఆసరా, చేయూత లబ్ధిదారులకు నవంబర్ 26 నుంచి తొలి దశ పాడి పశువుల పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గొర్రెలు, మేకల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. మహిళల్లో స్వయం సాధికారత, సుస్థిర ఆర్థికాభివృద్ధికి ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పశువుల దాణా, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. వైయస్‌ఆర్ ఆసరా, చేయూత పథకంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీదిరి అప్పలరాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ, పశుసంవర్థక శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. – ఇప్పటి వరకు ఆవులు, గేదెల కోసం 4.68 లక్షల మంది ఆప్షన్. గొర్రెలు, మేకల కోసం 2.49 లక్షల మంది మహిళల ఆప్షన్. – ఒక్కో యూనిట్ ధర రూ.75 వేలు, ప్రాజెక్టు విలువ రూ.5,386 కోట్లు. – జిల్లాల వారీగా పలు అంశాలపై నిశితంగా సమీక్షించిన సీఎం – 2,11,780 ఆవులు, 2,57,211 గేదెలు, 1,51,671 గొర్రెలు, 97,480 మేకల పంపిణీకి ప్రభుత్వం ప్రణాళిక. – లబ్ధిదారులకు ఇవ్వనున్న ప్రతి పశువుకు ఫిజికల్ వెరిఫికేషన్. – లబ్ధిదారుల జాబితాను ఆర్బీకేల పరిస్థిలో రిజిస్టర్ చేయనున్న అధికారులు. – ప్రతి నెలా పశువు ఆరోగ్యాన్ని పరిశీలించనున్న వైద్యుడు. పాడి పశువుకు ఇచ్చే ఆరోగ్యకార్డులో వివరాలు నమోదు. పాడి పశువు ఇచ్చే పాల దిగుబడి కూడా నమోదు. – నవంబర్ 26 నుంచి తొలిదశలో పాడి పశువుల పంపిణీ. వర్చువల్ విధానంలో 4 వందల గ్రామాల్లో పంపిణీని ప్రారంభించనున్న సీఎం. – తొలుత ప్రకాశం, చిత్తూరు, వైయస్‌ఆర్ జిల్లాల్లో పంపిణీ. తర్వాత దశల వారీగా పంపిణీ చేసేందుకు ప్రణాళిక. గొర్రెలు, మేకల పంపిణీకి ప్రణాళిక సిద్ధం. – ఆర్బీకేల పరిధిలో ఏర్పాటు చేస్తున్న వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలను పశువుల వైద్యానికి వినియోగించుకోవాలని సీఎం ఆదేశం. – కాల్ సెంటర్ల ఏర్పాటు, వాటి ద్వారా వైద్యం అందేలా చూడాలని, పశువుల దాణా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని, దాణాలో కెమికల్స్ లేకుండా చూడాలని సీఎం ఆదేశం.