గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో మ‌రో కీల‌క అడుగు

పీఎంయూ కాల్ సెంట‌ర్ ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

యంత్రాంగంలో ఎక్క‌డ ద‌ర‌ఖాస్తు ఆగినా అప్ర‌మ‌త్తం చేయ‌నున్న పీఎంయూ

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో డిజిట‌ల్ బోర్డులు ఏర్పాటు చేయాలి

వార్డు స‌చివాల‌యాల నిర్మాణం, అర్బ‌న్ హెల్త్ క్లినిక్స్‌పై దృష్టిపెట్టాలి

సెప్టెంబ‌ర్‌లోగా స‌చివాల‌యాల్లో ఖాళీల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలి

అధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశం

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌పై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా ప్ర‌భుత్వ ప‌థకాలు, సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు చేర్చారు. నిర్దేశిత స‌మ‌యంలోగా విన‌తుల ప‌రిష్కారంపై మ‌రో కీల‌క అడుగు పడింది. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల కోసం ప్ర‌త్యేకంగా ప‌ర్సుయేష‌న్ అండ్ మానిట‌రింగ్ యూనిట్ (పీఎంయూ) కాల్ సెంట‌ర్‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. యంత్రాంగంలో ఎక్క‌డ ద‌ర‌ఖాస్తు ఆగినా పీఎంయూ అప్ర‌మ‌త్తం చేయ‌నుంది. నిర్దేశించిన స‌మ‌యంలోగా ప‌రిష్కారం అయ్యేలా పీఎంయూ ప‌నిచేయ‌నుంది. మొద‌ట‌గా నాలుగు స‌ర్వీసులు, అక్టోబ‌ర్ నుంచి 543కి పైగా సేవ‌లను అమ‌లు చేయ‌నున్నారు.

గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. స‌మావేశానికి పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సామాజిక త‌నిఖీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విడుద‌ల చేశారు. మారుమూల ప్రాంతాల్లో స‌చివాల‌యాల‌కు నెట్ స‌దుపాయాన్ని సీఎం ప్రారంభించారు. ఫంక్ష‌న‌ల్ బ్రాడ్ బ్యాండ్ ఇంట‌ర్నెట్ స‌ర్వీసుల‌తో స‌చివాల‌యాలను అనుసంధానం చేశారు. ఇంట‌ర్నెట్ లేని 512 స‌చివాల‌యాల‌ను అనుసంధానం చేయ‌నున్నారు. ఇందులో 213 స‌చివాల‌యాల్లో ఇప్ప‌టికే ఏర్పాటు చేశారు. మిగిలిన స‌చివాల‌యాల‌ను వ‌చ్చే 2 నెల‌ల్లో అనుసంధానిస్తామ‌న్న అధికారులు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో డిజిట‌ల్ బోర్డులు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. డిజిట‌ల్ బోర్డుల ద్వారా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు అందుబాటులో ఉంచాల‌న్నారు. అదే విధంగా వార్డు  స‌చివాల‌యాల నిర్మాణంపై దృష్టిపెట్టాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. అంతేకాకుండా అర్బ‌న్ హెల్త్ క్లినిక్స్‌పై దృష్టిపెట్టాల‌ని సూచించారు.
 
గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ఖాళీల‌కు సెప్టెంబ‌ర్‌లోగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌పై గ్రామ‌, స‌చివాల‌య ఉద్యోగుల‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌న్నారు. స‌చివాల‌యాల్లోని ఉద్యోగులు,  వ‌లంటీర్ల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల మీద పూర్తి అవ‌గాహ ఉండాల‌న్నారు. ల్యాండ్ రెవెన్యూ  రికార్డుల ప్ర‌క్షాళ‌న షెడ్యూల్ ప్ర‌క‌టించాల‌ని, ఆ షెడ్యూల్‌ను త‌న‌కు నివేదించాల‌ని సీఎం ఆదేశించారు.

తాజా వీడియోలు

Back to Top