`స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్` అజెండాపై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: సెప్టెంబ‌ర్ నెల‌లో కేరళలో జరగనున్న 30వ‌ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స‌మీక్ష జ‌రిగింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో స‌ద‌ర‌న్ జోన‌ల్ కౌన్సిల్ మీటింగ్‌లో ప్ర‌స్తావించాల్సిన అంశాలపై మంత్రులు, అధికారుల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించారు. ఈ స‌మావేశంలో మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, సీఎస్ స‌మీర్ శర్మ‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య,పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top