తాడేపల్లి: దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ఏర్పాట్లపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తిరుపతిలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం.. ఏపీ అభివృద్ధి కోసం చర్చించాల్సిన అంశాలపై సీఎం సమీక్షిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.