ఏఎంఆర్‌డీఏపై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష

 తాడేపల్లి: అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీపై ముఖ్యమంత్రి వైయ‌స్‌‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఏఎంఆర్డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం ఇతర అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో ప్రస్తుతం ఏయే దశల్లో నిర్మాణాలు ఉన్నాయో అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. వాటిని పూర్తిచేసే కార్యాచరణపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని, ఆర్థికశాఖ అధికారులతో కలిసి కూర్చుని ప్లాన్‌ చేసుకోవాలని సూచించారు. హ్యపీ నెస్ట్‌ బిల్డింగులను పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top