తాడేపల్లి: కోవిడ్–19 నివారణ చర్యలపై సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై ప్రజలను ఆందోళనకు గురిచేయొద్దని, కరోనాపై కాల్‌సెంటర్ ఏర్పాటు చేయండి అని ఆదేశించారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నామని, రాష్ట్రంలో ఒక్క కరోనా కేసుల కూడా నమోదు కాలేదని సీఎం వైయస్ జగన్‌కు అధికారులు వివరించారు. రాష్ట్ర వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామని తెలియజేశారు.