స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి

పెట్టుబడులను ఆకర్షించేలా కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశం

తాడేపల్లి: కడప స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, వీలైనంత త్వరగా కంపెనీ ఎంపిక పూర్తికావాలని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పెట్టుబడులను ఆకర్షించేలా కొప్పర్తి ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌(ఈఎంసీ)ని తీర్చిదిద్దాలని ఆదేశించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యం కావాలన్నారు. 
 

Back to Top