ప్రతి మండల కేంద్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటు  

జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సమీక్ష

అమరావతి: ప్రతి మండల కేంద్రంలో భూ వివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని, శాశ్వత ప్రాతిపదికన ఈ ట్రైబ్యునల్‌ పనిచేయాలని అధికారులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భూ వివాదాల పరిష్కారం కోసం సీఎం వైయ‌స్ జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జగనన్న భూరక్ష హక్కు కింద సమగ్ర సర్వే ముగిశాక కూడా ట్రైబ్యూనళ్లు కొనసాగనున్నట్లు వెల్లడించారు. 

సర్వే సందర్భంగా కూడా తలెత్తే వివాదాల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉండాలని అధికారులకు వెల్లడించారు. మొబైల్‌ ట్రైబ్యునల్‌ యూనిట్లు ఉండాలని, దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. భూ వివాదాల పరిష్కారంపై రాష్ట్రంలో అత్యుత్తమ వ్యవస్థను తీసుకురావాలని అధికారులకు సీఎం సూచించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వ‌హించిన‌ సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
 

Back to Top