కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం సమీక్ష ప్రారంభం

తాడేపల్లి: కోవిడ్‌ నివారణ, నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. కరోనా నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, కర్ఫ్యూ అమలు, తదితర అంశాలపై చర్చించి ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హాజరయ్యారు. 
 

Back to Top