కోవిడ్‌ థర్డ్ వేవ్‌పై పూర్తి సన్నద్ధంగా ఉండండి

ఉన్న‌తాధికారులకు సీఎం వైయస్ జగన్‌ ఆదేశం 

కోవిడ్‌ పాజిటివిటీ రేటు త‌క్కువున్న 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు

థర్డ్‌ వేవ్‌ సమాచార నేపథ్యంలో 104 ద్వారా పిల్లలకు చికిత్స

24 గంటలూ అందుబాటులోకి పీడియాట్రిక్‌ టెలీ సేవలు

కోవిడ్‌ బాధితులకు సైకలాజికల్‌ కౌన్సెలింగ్‌

తాడేప‌ల్లి: క‌రోనా పాజిటివిటీ రేట్ 5 శాతం కంటే త‌క్కువగా ఉన్న జిల్లాల్లో క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు స‌డ‌లిస్తూ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు. అదే విధంగా కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌పై పూర్తి స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. కోవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. కోవిడ్ క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను అధికారులు సీఎంకువివ‌రించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ప‌లు అంశాల‌పై సీఎం దిశానిర్దేశం చేశారు.

ఏపీలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 44,773 ఉన్నాయ‌ని, ప్ర‌స్తుతం ఆస్పత్రుల్లో 7,998 మంది చికిత్స‌పొందుతున్నార‌ని, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 5,655 మంది చికిత్స‌పొందుతున్నార‌ని, రికవరీ రేటు 96.95 శాతం, పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉంద‌ని అధికారులు సీఎంకు వివ‌రించారు. 8 జిల్లాల్లో ప్రస్తుతం 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు నమోదైంద‌న్నారు. గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, వైయస్ఆర్ కడప, అనంతపురం, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు జిల్లాలో 5 కంటే తక్కువ పాజిటివిటీ రేట్ ఉంద‌ని తెలిపారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులలో  93.62 శాతం బెడ్లు ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స అందిస్తున్న‌ట్లు వివ‌రించారు. 

బ్లాక్‌ ఫంగస్‌
బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 3329
చికిత్స పొందుతున్నవారు 1441 
 మృతి చెందినవారు 253 
డిశ్చార్జ్‌ అయినవారు 1635 

థర్ఢ్‌ వేవ్‌ సమాచారం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలతో కార్యాచరణను అధికారులు సీఎంకు వివ‌రించారు. థర్డ్‌వేవ్‌ వస్తుందన్న సమచారంతో ఇప్పటికే మూడు దఫాలుగా నిపుణులతో వెబినార్‌ నిర్వహించామన్నారు. కొత్త వైద్యులకు కూడా ఈ వెబినార్‌లో చర్చించిన అంశాలతో అవగాహన కలిగించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. టెలీమెడిసిన్‌ కూడా అందుబాటులో తెస్తున్నామని అధికారులు తెలిపారు. 

సైకలాజిలక్ కౌన్సెలింగ్‌
కోవిడ్‌ బాధితులకు మానసిక నిపుణులతో సలహాలు, సూచనలు అందిస్తున్నామని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. 190 మంది సైకియాట్రిస్టులు, 16 మంది క్లినికల్‌ సైకాలజిస్టులుతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామ‌ని తెలిపారు. ఐసీఎంఆర్‌  గైడ్‌లైన్స్‌ ప్రకారం సైకలాజికల్‌ కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తున్నామ‌ని, అవసరమైన వారికి మందులు కూడా అందిస్తున్నామని వెల్లడించారు. దీన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్‌ ఏమన్నారంటే..

ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు
కోవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో సడలింపు
8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపు
రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేయాలి
రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కొనసాగనున్న కర్ఫ్యూ
ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు 
ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6వరకూ కర్ఫ్యూ  
ఈ జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున నిర్ణయం
జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తింపు
పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈజిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం

ధర్ధ్‌ వేవ్‌– సన్నద్ధత
కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ సమాచార నేపథ్యంలో 104 ద్వారా పిల్లలకు చికిత్స
24 గంటలూ అందుబాటులోకి పీడియాట్రిక్‌ టెలీ సేవలు
150 మంది పీడియాట్రిషియన్లు టెలీ సేవలు
ఇది ప్రారంభించే ముందు పీడియాట్రిషియన్ల అందరికీ శిక్షణ ఇప్పించాలి
దీనికోసం ఎయిమ్స్‌లాంటి అత్యుత్తమ సంస్ధల నిపుణుల సేవలను వినియోగించుకోవాలి
జిల్లాల్లో సంబంధిత జేసీలను కూడా 104 సేవల్లో భాగస్వామ్యం చేయాలి. వారి ఓనర్‌షిప్‌ ఉండాలి
అడ్మిషన్లు అవసరమైతే తక్షణమే స్పందించి వారికి బెడ్లు ఇప్పించాలి
దీనికి అనుగుణమైన వ్యవస్థను బలోపేతం చేయండి
కోవిడ్‌ యేతర కేసులకూ 104 ద్వారా ఈ పద్ధతుల్లో సేవలు అందాలి
సీజనల్‌ వ్యాధులకూ 104 కాల్‌సెంటర్‌ ద్వారా సేవలు అందాలి
విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలతోపాటు 104 కూడా ఆరోగ్యశ్రీకి రిఫరెల్‌ పాయింట్‌గా వ్యవహరించాలి
మనం ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులను నియమించాం
మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేశాం
ప్రతి వైద్యుడు నెలకు రెండుసార్లు గ్రామాల్లో పర్యటించాలి
ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్‌నెస్‌ రెండూ ఉండేటట్లు రన్‌ చేయాలి

ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం.టీ.కృష్ణబాబు,  వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ మరియు వాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top