ఏప్రిల్‌ 13న వాలంటీర్లకు సత్కారం

ఏప్రిల్, మే నెలలో ప్రారంభించే పథకాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: ఏప్రిల్‌ 13న గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఏప్రిల్, మే నెలలో ప్రారంభించే పథకాలు, కార్యక్రమాలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్‌ 13న వాలంటీర్లకు సత్కారించాలని ఆదేశించారు. ఏప్రిల్‌ 16న జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. విద్యా దీవెన కింద నేరుగా తల్లుల అకౌంట్లలోకే నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 20న వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. రబీకి సంబంధించి రైతుల అకౌంట్లలోకి నేరుగా నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్‌ 23న వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ కింద డ్వాక్రా మహిళల అకౌంట్లలోకి నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 28న జగనన్న వసతి దీవెన ప్రారంభిస్తున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఏడాదిలో మూడుసార్లు జగనన్న వసతి దీవెన అందజేస్తున్నట్లు చెప్పారు. మే 13న వైయస్‌ఆర్‌ రైతు భరోసా, 18న మత్స్యకార భరోసా, 25న ఖరీఫ్‌ బీమా అందజేస్తున్నట్లు సీఎం వైయస్‌ జగన్‌ కలెక్టర్లకు తెలిపారు. ఈ కార్యక్రమాలు విజయంతం చేయాలని, అర్హులకు ఏ  ఒక్కరికీ కూడా అన్యాయం జరుగకూడదని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు.
 

తాజా ఫోటోలు

Back to Top