సెప్టెంబ‌ర్‌క‌ల్లా సాఫ్ట్‌వేర్ రూపొందించాలి

ఉన్న‌తాధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

వ్య‌వ‌సాయ గోదాములు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: వ్య‌వ‌సాయ గోదాములు, కోల్డ్‌స్టోరేజీల నిర్మాణంపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశానికి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. రూ. 4 వేల కోట్ల‌తో వ్య‌వ‌సాయ మార్కెటింగ్ బ‌లోపేతం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. ప్ర‌తి రైతు భ‌రోసా కేంద్రం (ఆర్బీకే) ప‌రిధిలో గోదాములు, గ్రేడింగ్‌, సార్టింగ్ యంత్ర ప‌రిక‌రాలు, ప్ర‌తి మండ‌లానికి కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేప‌ట్టాల‌న్నారు. త‌న వ‌ద్ద ప‌లానా పంట ఉంద‌ని రైతు ఆర్బీకేకు స‌మాచారం ఇస్తాడు.. ఆ స‌మాచారం ఆధారంగా నేరుగా సెంట్ర‌ల్ స‌ర్వ‌ర్‌కు చేరాలి. రైతు త‌న పంట‌ను అమ్ముకునేలా మార్కెటింగ్ శాఖ తోడ్పాటు అందించాలని సూచించారు. క‌నీస గిట్టుబాటు ధ‌ర రాని ప‌క్షంలో ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధితో ఆదుకోవాలని ఆదేశించారు. సెప్టెంబ‌ర్ క‌ల్లా దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ రూపొందించాలని అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశించారు. 

Back to Top