నెలాఖ‌రులోగా అన్ని స్కూళ్ల‌లో నాడు-నేడు ప‌నులు పూర్తి

నాడు-నేడుపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌
 

తాడేప‌ల్లి: ఈ నెలాఖ‌రులోగా అన్ని స్కూళ్ల‌లో నాడు-నేడు ప‌నులు పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు.విద్యాశాఖ‌లో నాడు-నేడు కార్య‌క్ర‌మంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిస‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సోమ‌వారం ఉద‌యం నిర్వ‌హించిన స‌మీక్ష‌లో మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. కాగా, హైస్కూల్ టీచ‌ర్లు ప్ర‌తి సోమ‌, మంగ‌ళ‌వారాల్లో హాజ‌రుకావాల‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్హులు జారీ చేసింది. ప్ర‌తి ప్రాథ‌మిక పాఠ‌శాల టీచ‌ర్లు వారంలోఒక రోజు హాజ‌రు కావాలి.బ్రిడ్జి కోర్సులు రూపొందించేందుకు ఉపాధ్యాయులు విధుల‌కు హాజ‌రుకావాల‌ని ఉత్త‌ర్హుల్లో పేర్కొన్నారు.

Back to Top