విశాఖ గ్యాస్‌ లీకేజీ, సహాయ చర్యలపై సీఎం సమీక్ష

తాడేపల్లి: విశాఖపట్నం జిల్లా వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ ఘటన, బాధితులకు అందుతున్న సయహా చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. విశాఖ నుంచి సీఎస్‌ నీలం సహాని, కలెక్టర్‌ విజయ్‌చంద్‌, సీపీ ఆర్కే మీనా తదితరులు సమీక్షలో పాల్గొని సీఎంకు అక్కడి వివరాలను వెల్లడించారు. కాలుష్య కారక అంశాలపై ప్రణాళిక రూపొందించాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక రూపొందించాలన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఉష్ణోగ్రత అంశాలపై సమీక్షించాలన్నారు. ఘటన స్థలం, పరిసర ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.

Back to Top