సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో నలుగురు మహిళలకు విముక్తి

కువైట్‌ నుంచి బాధిత మహిళలను స్వగ్రామాలకు తీసుకువచ్చేందుకు చర్యలు
 

అమరావతి: కువైట్‌లో బందీలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు మహిళలకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చొరవతో విముక్తి లభించింది.  కువైట్‌లో బందీలుగా ఉన్న ఆడపడుచుల బాధలు విని వెంటనే వారిని సీఎం ఆదుకున్నారు.  కువైట్‌లో చిక్కుకున్న పశ్చిమ గోదావరి జిల్లా మహిళలు తమ దీనావవస్థపై బాధితులు ఓ వీడియోలో సందేశం పంపించారు. ఈ వీడియో వైరల్‌ అయ్యింది. బాధితుల గోడుపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. సీఎంవో ఆదేశాలతో రంగంలోకి దిశ స్పెషల్‌ ఆఫీసర్‌, జిల్లా ఎస్పీ,  బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు.  కువైట్‌ ఎంబసీతో దిశ స్పెషల్‌ ఆఫీసర్‌, జిల్లా ఎస్పీ మాట్లాడారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చొరవతో నలుగురు బాధిత మహిళలకు విముక్తి లభించింది. కువైట్‌ నుంచి బాధితులను స్వగ్రామాలకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. తమకు సీఎం వైయస్‌ జగన్‌ విముక్తి కలిగించారని బాధిత మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. 

Back to Top