రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు స్వాగతం పలికిన సీఎం వైయ‌స్ జగన్‌

విశాఖ‌:  భార‌త‌ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్‌కు సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. విశాఖపట్నంలో సోమవారం జరిగే ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ(పీఎఫ్‌ఆర్‌) కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ విశాఖ వ‌చ్చారు. విశాఖ‌లో రాష్ట్ర‌ప‌తికి రాష్ట్ర ప్ర‌భుత్వ త‌ర‌ఫున ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అంత‌కుముందు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు విశాఖ‌ ఎయిర్‌పోర్టులో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి అవంతి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి స్వాగతం పలికారు.  

తాజా వీడియోలు

Back to Top