నెల్లూరు: మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ వద్దకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్‌కు మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ మ్యాప్‌ను సీఎం వైయస్ జగన్ పరిశీలించారు. బ్యారేజ్ విశిష్టను అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం ఫొటో గ్యాలరీని పరిశీలించారు. మరికొద్దిసేపట్లో మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ సీఎం వైయస్ జగన్ ప్రారంభించనున్నారు.