విశాఖకు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

మ‌రికాసేప‌ట్లో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప్రారంభోత్స‌వం

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైయ‌స్ఆర్ సీపీ ముఖ్య నేత‌లు, అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. మ‌రికాసేప‌ట్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివిధ అభివృద్ది కార్యక్రమాల‌ను ప్రారంభించ‌నున్నారు. పీఎం పాలెంలోని వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స్టేడియం వ‌ద్ద దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించ‌నున్నారు. ఆరిలోవ అపోలోకు చేరుకొని అపోలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించ‌నున్నారు. అనంతరం బీచ్‌ రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్‌ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభించ‌నున్నారు. రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాను ప్రారంభించనున్నారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌కు శంకుస్థాప‌న చేయనున్నారు. 

Back to Top