పులివెందుల చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

కాసేప‌ట్లో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశం

వైయ‌స్ఆర్ జిల్లా: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పులివెందుల చేరుకున్నారు. ఉద‌యం గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టు నుంచి వైయ‌స్ఆర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. కొద్దిసేప‌టి క్రిత‌మే పులివెందులలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. మ‌రికొద్దిసేప‌ట్లో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, ముఖ్య‌నేత‌ల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మావేశం కానున్నారు. 

కాసేపట్లో ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిపి, వినతులు స్వీకరించిన అనంత‌రం  పులివెందులలో బయోసైన్స్‌కు శంకుస్థాపన చేయనున్నారు. వేంపల్లెలో వైయ‌స్ఆర్ సార్మక పార్క్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రారంభించనున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top