మందపల్లికి చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

వైయ‌స్ఆర్ జిల్లా: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇటీవ‌ల భారీ వ‌ర్షాల కార‌ణంగా న‌ష్ట‌పోయిన బాధితుల‌తో ముఖ్య‌మంత్రి మాట్లాడుతున్నారు. కొద్దిసేప‌టి కిత్రం మంద‌ప‌ల్లి గ్రామానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ చేరుకున్నారు.    పుల్ల పొత్తూరు గ్రామంలో పర్యటించి వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను ప‌రిశీలిస్తారు. అక్క‌డి సహాయ శిబిరంలో ఉన్న వారితో మాట్లాడ‌తారు. అనంత‌రం ఎగుమందపల్లి వెళ్తారు. ఆ ప్రాంతంలో కాలినడకన పర్యటిస్తారు. ఆ త‌ర్వాత‌ అన్నమయ్య డామ్‌ సైట్‌కి వెళ్లి దెబ్బతిన్న ప్రాజెక్టును పరిశీలిస్తారు.

ప్రాజెక్టుకు జరిగిన నష్టంపై  వైయ‌స్ జ‌గ‌న్ కు అధికారులు వివ‌రాలు తెలుపుతారు. అక్క‌డి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మందపల్లి చేరుకుంటారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ త‌ర్వాత‌ చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వేదలచెరువు ఇత‌ర కాల‌నీల ప్రజలతో మాట్లాడ‌తారు. ఈ రోజు సాయ‌త్రం ఏర్పేడు మండలం, పాపనాయుడు పేట గ్రామాల్లో ప‌ర్య‌టిస్తారు.

ఆ త‌ర్వాత‌ తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు, పాడిపేట క్రాస్‌కు వెళ్తారు. ఈ రోజు రాత్రి పద్మావతి అతిథి గృహంలో బసచేస్తారు. రేపు జ‌గ‌న్ చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. వరద నష్టాన్ని పరిశీలించి, స్ధానికులతో ముఖాముఖి మాట్లాడ‌తారు.  

నెల్లూరు రూరల్ లోనూ ఆయ‌న ప‌ర్య‌టన కొన‌సాగుతుంది. రేపు మ‌ధ్యాహ్నం నెల్లూరు నగరపాలక సంస్ధ ప‌రిధిలోని కాల‌నీల‌ను ప‌రిశీలిస్తారు. రేపు సాయ‌త్రం 4.30 గంటలకు రేణిగుంట నుంచి గన్నవరం చేరుకుంటారు. అక్కడ నుంచి కాన్వాయ్‌లో తాడేపల్లి వెళ్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top