విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆర్థిక సాయం అందించారు. ఒక్కొక్కరి అకౌంట్లలో రూ. 10 వేల సాయం జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్యాస్ ప్రభావిత గ్రామాల ప్రజలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. సంఘటనకు సంబంధించిన వివరాలను, ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ఘటనపై జరుగుతున్న విచారణను ప్రజలకు వివరించారు. అనంతరం క్యాంపు కార్యాలయం నుంచి లాప్‌టాప్‌లో బటన్ నొక్కి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున 19,893 మందికి ఆర్థికసాయం వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, గ్రామాల్లో హెల్త్ క్లినిక్‌లు నిర్మిస్తున్నామని, ప్రజల ఆరోగ్యాన్ని నిరంతరం మానిటరింగ్ చేస్తూ ఉంటామని చెప్పారు. అదే విధంగా గ్యాస్ ప్రభావిత గ్రామాల కుటుంబాలకు సపరేట్ హెల్త్ కార్డులు కూడా జారీ చేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ వివరించారు.