రోశయ్య కుమారుడితో మాట్లాడిన సీఎం వైయస్‌ జగన్‌

అమరావతి: మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైజ్ఞ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేర‌కు రోశ‌య్య కుమారుడిని ఫోన్‌లో సీఎం వైయ‌స్ జగన్‌ పరామర్శించారు. అంత‌కుముందు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  ‘‘పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని’’  సీఎం వైయ‌స్‌ జగన్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. మరోవైపు, రోశయ్య మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఇవాళ్టి నుంచి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. 

Back to Top