శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం వైయస్‌ జగన్‌

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తిరునామం,  పంచెకట్టుతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా వెళ్లి ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎం వైయస్‌ జగన్‌కు  ఆశీర్వచనాలు అందించారు. అనంతరం శ్రీవారి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు.  తిరుమల తిరుపతి దేవస్థానం క్యాలెండర్‌ను, డైరీని ఆవిష్కరించారు. కాసేపటి క్రితమే బేడి ఆంజనేయస్వామిని ద‌ర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top