తాడేపల్లి: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఉన్నారు. వివేకానందుని మాటలు స్ఫూర్తిదాయకం.. యువతకు సీఎం వైయస్ జగన్ యువజనోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు’ అన్న స్వామి వివేకానంద గారి మాటలను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనలో అంకిత భావంతో మనమందరం ముందడుగులు వేయాలి. జాతీయ యువజనోత్సవ సందర్భంగా యువత అందరికీ శుభాకాంక్షలు` తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు.