తాడేపల్లి: మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘సృష్టిలో అమ్మ ప్రేమను మించినది మరొకటి ఉండదు. అమ్మ మనకు మార్గదర్శకురాలు, స్ఫూర్తిదాయని. మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు’ తెలుపుతూ సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు.