నిపుణుల కమిటీతో పోలవరం పనులపై ఆడిటింగ్‌

సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు
 

పశ్చిమగోదావరి: పోలవరం పనులపై నిపుణుల కమిటీతో ఆడిటింగ్‌ చేయించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన వైయస్‌ జగన్‌ అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. డ్యామ్‌ పూరై్తన 10 నెలలలోపు హైడ్రాలిక్‌ పవర్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న కాంట్రాక్టర్లు 2021 ఫిబ్రవరి నాటికి ప్రధాన జలశయాన్ని పూర్తి చేస్తామన్నారు. పవర్‌ ప్రాజెక్టును 2021 డిసెంబర్‌కు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. వచ్చే నాలుగు నెలల్లో ఏయే పనులు చేయగలరని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. స్పిస్‌ ఛానెల్‌ ఏటిగట్లను పటిష్టపరుస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. 
 

Back to Top