తాడేపల్లి: సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలు ఇబ్బంది పడకుండా మన ప్రభుత్వంలో వైయస్సార్ మత్స్యకార భరోసా ద్వారా వారికి సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం ప్రవేశపెట్టిన నాలుగేళ్ళలోపే ఐదు విడతలనూ పూర్తి చేసి ఒక్కో మత్స్యకార సోదరుడికి మొత్తం రూ.50 వేలను అందజేశామని సీఎం వైయస్ జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,23,519 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయం అయిన ఏఫ్రిల్ 15 నుంచి జూన్ 14 మధ్య కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10వేలు చొప్పున రూ.123.52 కోట్ల ఆర్ధిక సాయాన్ని ఇవాళ సీఎం వైయస్ జగన్ అందజేశారు.. దీంతో పాటు ఓఎన్‌జీసీ సంస్ధ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలలోని 23,458 మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్న దాదాపు రూ.107.91 కోట్లతో కలిపి మొత్తం రూ.231 కోట్లను బాపట్ల జిల్లా నిజాంపట్నంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు.