అసెంబ్లీ: డిసెంబర్ 15న 2019 ఖరీఫ్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ రూ.1227 కోట్ల క్లెయిమ్స్ రిలీజ్ చేస్తామని కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో చర్చించాం.. కేబినెట్‌లో కూడా ఆమోదించామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్ 2వ తేదీన అమూల్‌తో కార్యక్రమం, 10వ తేదీన మేకలు, గొర్రెలు పంపిణీకి శ్రీకారం, 15న రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము చెల్లిస్తామని, 21న సమగ్ర భూసర్వే కార్యక్రమం, 25వ తేదీన పేదలకు డీఫామ్ పట్టాలు ఇస్తామని కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో చెప్పి.. కేబినెట్‌లో కూడా ఇదే ప్రస్తావన చేశామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ బీమా ప్రీమియంపై అసెంబ్లీలో ఏం మాట్లాడుతూ.. 'జగన్ ఒక మాట చెబితే.. ఆ మాట నెరవేరుస్తాడనే విశ్వాసం ప్రజల్లో ఉంది. అదే చంద్రబాబు ఒక మాట చెబితే.. ఖచ్చితంగా చేయడు అనేది ప్రజల్లో నమ్మకం. మనం చేసే పనుల వల్లే ఈ క్రెడిబులిటీ వస్తుంది. 18 నెలలుగా జగన్ అనే వ్యక్తి ఒక తేదీ ఇచ్చి.. ఆ తేదీన ఇవ్వకుండా పోయిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మేనిఫెస్టోలోని అంశాలను 90 శాతానికి పైగా దేవుడి దయ, ప్రజల దీవెనలతో అమలు చేయగలిగాం. మాట చెబితే.. ఆ మాటకు కట్టుబడి ఉంటామనే నమ్మకం ప్రజలకు ఇచ్చాం. బిల్లులపై చర్చ జరుగుతుంది.. చర్చ జరగనివ్వాలి.. అవకాశం ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వాలి. చర్చ జరగకూడదనే అభిప్రాయం ఏంటీ..? ప్రతిపక్ష సభ్యులు ఎందుకు అసెంబ్లీకి వస్తున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. టిడ్కో ఇళ్లకు సంబంధించిన చర్చ జరగాలని ప్రతిపక్షానికి ఉద్దేశమే లేదు. చంద్రబాబు స్కీమ్ ముద్దా.. జగన్ స్కీమ్ ముద్దా అని ఇటీవల ప్రకటన ఇచ్చాం. ప్రజలు ఏ స్కీమ్‌పై టిక్కు పెట్టారని రిపోర్టు అడిగితే.. పది మంది కూడా చంద్రబాబు స్కీమ్‌కు టిక్కుపెట్టలేదని తేలింది. చంద్రబాబు బుద్ధి మొత్తం కుటిల బుద్ధి. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును రెండు, మూడు సీట్లకు పరిమితం చేస్తారు'.