తాడేపల్లి: ఆరోగ్యవంతమైన భవిష్యత్తు తరాలకోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేశామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. నిధులకు వెనుకాడకుండా.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఖర్చుచేసి గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. మహిళా,శిశుసంక్షేమశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఫౌండేషన్ స్కూల్‌లో చిన్నారులకు బోధనపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం. ప్రత్యామ్నాయ బోధనా విధానాలపై పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశం. ఇంగ్లిషు భాషలో పరిజ్ఞానం, ఉచ్ఛారణ బాగుండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. గర్బిణీలు, బాలింతలకు ఇచ్చే వైయస్‌ఆర్ సంపూర్ణ పోషణ, వైయస్‌ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ – టేక్ హోం రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం వైయస్.జగన్. ముఖ్యమంత్రి చేతుల మీదుగా డ్రైరేషన్ అందుకున్న గర్భిణీలు, బాలింతలు. - గతంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.450 నుంచి రూ.500 కోట్లు ఖర్చు చేస్తే.. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పౌష్టికాహారం కోసం ప్రతిఏటా చేస్తున్న ఖర్చు సుమారుగా రూ.2300 కోట్లు. వైయస్ఆర్ సంపూర్ణ పోషణ్ కింద నెలకు అందే రేషన్ సరుకులు: 2 కేజీల రాగి పిండి. 1 కేజీ అటుకులు. 250 గ్రాముల బెల్లం. 250 గ్రాముల చిక్కీ. 250 గ్రాముల ఎండు ఖర్జూరం. 3 కేజీల బియ్యం. 1 కేజీ పప్పు. అర లీటరు వంటనూనె. 25 గుడ్లు. 5 లీటర్ల పాలు. వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద అందే రేషన్ సరుకులు: 1 కేజీల రాగి పిండి. 2 కేజీల మల్టీగ్రెయిన్‌ఆటా. 500 గ్రాముల బెల్లం. 500 గ్రాముల చిక్కీ. 500 గ్రాముల ఎండు ఖర్జూరం. 3 కేజీల బియ్యం. 1 కేజీ పప్పు. అర లీటరు వంటనూనె. 25 గుడ్లు. 5 లీటర్ల పాలు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే....: ఆరోగ్యవంతమైన భవిష్యత్తు తరాలకోసం సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేశాం: – నిధులకు వెనుకాడకుండా.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఖర్చుచేసి గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. – డ్రై రేషన్ కింద అందించే సరుకుల నాణ్యతపై నిరంతరం సమీక్ష చేయాలి: – నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించాలి: – గతంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహారం కోసం గత ప్రభుత్వం ఏడాదికి సుమారు రూ.450 నుంచి రూ.500 కోట్లు ఖర్చు చేస్తే.. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పౌష్టికాహారం కోసం ప్రతిఏటా చేస్తున్న ఖర్చు సుమారుగా రూ.2300 కోట్లు. - రక్తహీనత, పౌష్టికాహారలేమి లాంటి సమస్యలు పూర్తిగా రాష్ట్రంలో తొలగిపోవాలన్న లక్ష్యంతో ఇంత ఖర్చు చేస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ మంచి ఫలితాలు ఇవ్వాలి: దీనికోసం అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: – ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా అంగన్‌వాడీలను సందర్శించాలి: – అక్కడ పిల్లలు, తల్లులు, బాలింతల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించాలి: – ఏమైనా సమస్యలు ఉంటే వారికి మంచి వైద్యాన్ని అందించాలి: – బాల్యవివాహాల నిరోధం, అక్షరాస్యత పెంపు, చదువుల్లో బాలికలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్మ ఒడి, కళ్యాణమస్తు, వసతిదీవెన, విద్యా దీవెన ఏరకంగా ఉపయోగపడతాయన్నదానిపై బాగా అవగాహన కల్పించాలి : – వైయస్‌ఆర్ కళ్యాణమస్తు – షాదీతోఫా కూడా ఏ రకంగా బాల్యవివాహాలను నిరోధిస్తుందో కూడా వారికి వివరించాలి: – కళ్యాణమస్తు కింద లబ్ధి పొందాలంటే వధూవరులు తప్పనిసరిగా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలన్న నిబంధనను అందుకే పెట్టాం: – రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలపై ముమ్మర ప్రచారం నిర్వహించాలి: – అంగన్ వాడీ కేంద్రాల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూడాలి: – దీనికోసం క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి: – అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్ల పరిశుభ్రంగా ఉండేలా చూడాలి: – అంగన్‌వాడీ కేంద్రాలకు నిర్వహించే మరమ్మతుల్లో ముందుగా టాయిలెట్ల మరమ్మతును ప్రాధాన్యతగా తీసుకోవాలన్న సీఎం. – ఫౌండేషన్ స్కూలు పిల్లలకు విద్యాబోధనలో నాణ్యతకు పెద్దపీట వేయాలి: – ఇప్పుడున్న విద్యావిధానం కాక ఇతర విద్యావిధానాలనుకూడా పరిశీలించాలి : – ఫౌండేషన్ స్కూల్లో (పీపీ–1, పీపీ–2) పిల్లల్లో ఇంగ్లిషు భాషా పరిజ్ఞానం, ఫొనిటిక్స్, ఉచ్ఛారణ లాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని కోరిన సీఎం. – ఇప్పుడు మనం నిర్దేశించుకున్న సిలబస్‌ను వినూత్న బోధనా పద్ధతులతో నేర్పించే అంశాలపై దృష్టిపెట్టాలన్న సీఎం. – మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ ఇచ్చే కార్యక్రమం మొదలయ్యింది: – ఇప్పుడు పీపీ–1 నుంచి రెండో తరగతి పిల్లలమీద దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది: – పిల్లల మెదడు బాగా వృద్ధిచెందే వయసు కాబట్టి, వినూత్న బోధనా పద్దతుల ద్వారా వారికి మంచి భాషా జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉంది. – ఈ వయసులో పునాదిగట్టిగా పడితే.. ఇక పై తరగతుల్లో విద్యార్ధుల ప్రయాణం సాఫీగా ఉంటుంది: – దీంట్లో భాగంగా మాంటిస్సోరి విద్యావిధానంపై సమావేశంలో చర్చించిన సీఎం. – మాంటిస్సోరి విద్యావిధానాన్ని సీఎంతో చర్చించిన ఆ సంస్థకు చెందిన ప్రతినిధి. – అధికారులు ముందుగా మాంటిస్సోరి స్కూల్స్‌ను పరిశీలించాలన్న సీఎం.