అర్హ‌త ఒక్క‌టే ప్రామాణికం

కొత్త లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయనున్న సీఎం వైయ‌స్ జగన్‌
 

తాడేపల్లి: అర్హులైన ఏ ఒక్కరూ సంక్షేమ పథకాలకు దూరం కాకూడదనేది సీఎం వైయ‌స్ జగన్‌ సంకల్పం. అందుకే అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వాళ్లకు తాజాగా పథకాలు మంజూరు చేసింది. 

ఈ మేరకు కొత్త లబ్ధిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ(మంగళవారం) నగదు జమ చేయనున్నారు.

మొత్తం 3.36 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతిఫలం అందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వైయ‌స్సార్‌ పింఛన్‌ కానుకకు కొత్తగా 2,99,085 మంది ఎంపికయ్యారు. కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసింది ఏపీ సర్కార్‌.


 

తాజా వీడియోలు

Back to Top