నేడు కేంద్ర‌మంత్రి అమిత్ షాతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

న్యూఢిల్లీ: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతోంది. నేడు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో జ‌రిగే వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌ ఝార్ఖండ్, ఛత్తీస్‌గడ్, పశ్చి­మ బెంగాల్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు/హోంశాఖ మంత్రులు /అధికారులు హాజరు కానున్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం వైయ‌స్‌ జగన్‌ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై అమిత్ షాతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించ‌నున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top