జరుగుతున్న మంచి కొనసాగాలంటే.. మీ బిడ్డ రావాలి 

గుంటూరు బ‌హిరంగ స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

గుంటూరులో ఈ ప్రజానీకం ప్రతీ ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకెళ్తోంది

 
ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా చేయనంతగా ప్రతీ గ్రామంలోనూ పౌర సేవలు

గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఏకంగా రెండు లక్షల డబ్బై వేల కోట్ల రూపాయలు.. 

మీ బిడ్డకు మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్‌ గుర్తుపై నొక్కడానికి, మరో వంద మంది చేత నొక్కించడానికి మీరంతా సిద్ధమేనా? 

రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు చంద్రబాబు

మన రైతన్నలకు రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతున్నాను

ఆడ బిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25 వేల రూపాయలు బ్యాంక్‌లో డిపాజిట్‌ చేస్తామన్నాడు 

ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం.. ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు ప్రతీ ఇంటికి నిరుద్యోగ భృతి అన్నాడు

ఏ పేద వాడికైనా ఒకసెంటు స్థలమైనా ఇచ్చాడా? అని అడుగుతున్నాను

వుమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నాడు.. మరి చేశాడా?

ప్రతీ నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు.. మరి మీ గుంటూరులో ఏమైనా కనిపిస్తోందా? 

2014లో వీరి ముగ్గురూ కలిసి, చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికీ పంపించిన ఈ పాంఫ్లెట్‌లో ఇందులో చెప్పిన ఏ ముఖ్యమైన హామీల్లో ఒక్కటైనా అమలు అయ్యిందా

మరి 2014లో ప్రజల్ని మోసం చేసిన ఈ ముగ్గురు.. మళ్లీ వారు కలిసి కొత్త కొత్త హామీలతో కొత్త కొత్త వాగ్దాలతో వస్తున్నారు

రాష్ట్ర భవిష్యత్‌ను, పేదల భవిష్యత్‌ను కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా ప్రతీ ఇంటికి వెళ్లి నిజాలు చెప్పి స్టార్‌ క్యాంపయినర్లుగా మారండి

మోసపోకూడదంటే.. మీ బిడ్డకే ఓటు పడాలని చెప్పేందుకు సిద్థమేనా?

మన పిల్లల భవిష్యత్‌ బాగుపడాలన్నా, మన వ్యవసాయం,  మన హాస్పిటల్స్‌ మెరుగుపడాలన్నా ఫ్యాన్‌ గుర్తుపై రెండు ఓట్లు వేయాలి

175కు 175కు అసెంబ్లీ సీట్లు, 25కు 25 ఎంపీ స్థానాల్లో ఏ ఒక్కటీ తగ్గకూడదు.. అందుకు మీరు సిద్ధమేనా? 

గుంటూరు: గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం చేసిందని, జరుగుతున్న మంచి కొనసాగాలంటే.. మీ బిడ్డ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగా రావాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు.  ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లలో వేశామని తెలిపారు.  లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమం అందించామని పేర్కొన్నారు. 130 సార్లు బటన్‌ నొక్కి.. నేరుగా పేదల ఖాతాల్లో డబ్బు జమ చేశామన్నారు. ప్రజలు రెండుసార్లు బటన్‌ నొక్కి వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ సీపీని గెలిపించాలని కోరారు.  సీఎం వైయ‌స్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజు గుంటూరు జిల్లాలో సాగుతోంది. ఏటుకూరు బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రసంగించారు.   

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..: 

గుంటూరు చరిత్రలో నిల్చిపోయే మహాజనసముద్రం
గుంటూరులో ఈరోజు మరో ప్రపంచం కనిపిస్తోంది. ఈ మహాజనసముద్రం చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది. ఈ ప్రజానీకం ప్రతి ఇంటి చరిత్రనూ కొత్త బంగారు లోకానికి తీసుకువెళుతుంది. మనందరి ప్రభుత్వానికి మద్దతుగా, జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు, ఆ మంచిని కొనసాగించేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ ముందుగా నిండు మనసుతో మీ ఆప్యాయతలకు, మీ బిడ్డ రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. 

మీ ఆత్మగౌరవం పెంచిన ప్రభుత్వానికి మద్ధతివ్వడానికి సిద్దమేనా?
ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా గతంలో చేయనంతగా ప్రతి ఒక్క గ్రామంలోనూ పౌర సేవల్ని, పిల్లల చదువుల్ని, వైద్యాన్ని,రైతులకు అందుతున్న భరోసాను, వీటన్నింటితోపాటు అక్కచెల్లెమ్మల సాధికారతను, భద్రతను, అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచిన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా.. సిద్ధమేనా?

రూపాయి లంచం లేకుండా రూ.2.70 లక్షల కోట్లు జమ.
గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు మరోసారి చెబుతున్నాను.. ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు ఒక్క రూపాయి కూడా ఎక్కడా లంచం లేకుండా, ఎక్కడా వివక్షకు తావు లేకుండా నేరుగా బటన్ నొక్కి మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాల చేతికి అందించిన ప్రభుత్వానికి మద్దతుగా, మీ జగన్ కు మద్దతుగా రెండు బటన్లు ఫ్యాను మీద ప్రతి ఒక్కరూ నొక్కడానికి, మరో వంద మందితో చెప్పి నొక్కించడానికి మీరంతా.. సిద్ధమేనా? అని అడుగుతున్నాను. 

ఈ ఎన్నికలు బాబు మోసాలకు.. ప్రజలకు మధ్య యుద్ధం. 
ఈసారి జరగబోతున్న ఎన్నికలు.. ఈ కురుక్షేత్ర యుద్ధం.. చంద్రబాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరగబోతున్న యుద్ధం ఇది. ఇది కేవలం చంద్రబాబుకు, జగన్ కు మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. ఈ యుద్ధం ప్రజలకు, చంద్రబాబు మోసాలకు జరుగుతున్న యుద్ధం. ఇది ఇంటింటికీ పెన్షన్ అందించిన ప్రభుత్వానికి, దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది వారి మోసాలకు, మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న యుద్ధం.

ఈ అబద్ధాల బాబుకు ఇద్దరు వంతలు. ఒకరు దత్తపుత్రుడు, మరొకరు ఆయన వదినమ్మ. ఈ ముగ్గురూ కలిసి రోడ్ల మీద అబద్ధాలు బుర్ర కథలతో చెప్పడం మొదలు పెట్టారు. బాబు మోసాల బుర్రకథలు వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్య కాలంలో వాళ్లందరూ రోడ్ల మీద కనిపిస్తున్నారు. 

ఈ సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా నేను ఒకటే ఒకటి చెప్పదల్చుకున్నాను. మీ అందరికీ తెలిసిన విషయం. మీ బిడ్డ ఏం చేశాడు. ఈ 58 నెలల పాలనలో ఏరకంగా మీ బిడ్డ మీ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాడు. అని ప్రతి సందర్భంలోనూ, ప్రతి సిద్ధం సభలోనూ చెప్పుకుంటూ వచ్చాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏరకంగా మీ బిడ్డ మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి అడుగులు వేశాడు అన్నది చెప్పుకుంటూ వచ్చాడు. ఆలోచన చేయమని మీ అందరితో ప్రతి అడుగులోనూ కోరుతూ వచ్చాను. గతంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే ఏ రకమైన మార్పులు మీ బిడ్డ తీసుకొచ్చాడన్నది ప్రతి సిద్ధం సభలోనూ మీ అందరికీ చెప్పుకుంటూ వచ్చాను. 

మీ ఓటు - మంచిని కొనసాగించేందుకు మద్ధతు.
ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒకే ఒక అంశం మీద ఇంటికి వెళ్లి ఆలోచన చేయమని కోరుతున్నాను. మీ బిడ్డకు ఓటు వేయడం అంటే ఈ 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని మీరందరూ కూడా కొనసాగించేందుకు మీరు ఓటు వేస్తున్నారని దాని లెక్క. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. ఈ 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని మీరంతకు మీరే ఇక మాకు వద్దు అని ఓటు వేసినట్టు అవుతుందన్నది కూడా గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. 

ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. ఒక నాయకుడు అనే వాడు ఎలా ఉండాలి అని మనమంతా కోరుకుంటాం. మనమంతా సినిమాకు పోతాం. సినిమాలో హీరోను చూస్తాం. అదే సినిమాలో మనం విలన్ ను కూడా చూస్తాం. ఫలాన వాడు హీరో అని మనకు తెలియదు.ఫలాన వాడు విలన్ అని మనకు తెలియదు. కానీ, ఆ హీరోకు ఉన్న గుణగణాలను బట్టి ఆ మనిషిని హీరో అని అంటాం. ఆ విలన్ కు ఉన్న గుణగణాలను బట్టి ఆ మనిషిని విలన్ అని అంటాం. ఈరోజు నేను ఒక్కటే చెబుతున్నాను. 58 నెలల కిందట మీ బిడ్డ మీ అందరి ముందూ నిలబడి మీ బిడ్డ ఫలానిది చేస్తాను అని మేనిఫెస్టోను తీసుకొచ్చి మీ బిడ్డ మళ్లీ ఈరోజు 58 నెలల తర్వాత ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావిస్తూ.. ఆ మేనిఫెస్టోలో చెప్పినవి 99 శాతం వాగ్దానాలు అమలు చేసి మళ్లీ మీ బిడ్డ మీ అందరి ముందు నిలబడి ఈరోజు మీ అందరి ఆశీస్సులు కోరుతున్న మార్పు ఒక్కసారి గమనించమని కోరుతున్నాను. 

ప్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్తే....
అదే ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతున్నాను. వారు చేసిన పనులను ఒక్కసారి గమనించమని కోరుతున్నాను. ఇదే కూటమి.. మీ అందరికీ గుర్తుందా? 2014లో ఒక్క సారి ఫ్లాష్ బ్యాక్ లోకి పోదామా? ఈ ఫొటోలు గుర్తున్నాయా? ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే ఢిల్లీ నుంచి వాళ్లు తెచ్చుకున్న మోడీ గారు. 2014 లో ఇదే మేనిఫెస్టో అని చెప్పి రంగు రంగుల కాగితాలతో, ఆశలతో ప్రజల జీవితాలతో చెలగాటాలు ఆడుతూ.. వీళ్లు ఇదే మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు అని చెబుతూ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే మోడీ గారి ఫొటోతో, దత్తపుత్రుడి ఫొటోతో ప్రతి ఇంటికీ ఇదే పాంప్లెట్ పంపించాడు. ముఖ్యమైన అంశాలు ఎక్కడ మీరు మరిచిపోతారో అని ఈ పెద్దమనిషి చంద్రబాబు అప్పట్లో టీవీల్లో, పేపర్లలో ఊదరగొట్టారు అడ్వర్టైజ్‌మెంట్లతో ఇదే ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, టీవీ5లోనూ వీళ్లంతా ఊదరగొడుతూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందామా? 2014లో వీళ్లు చెప్పారో, ఏం చేశారో అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి పోదామా? 

చంద్రబాబు విఫల హామీలు..
రైతు రుణ మాఫీపై మొదటి సంతకం చేస్తాను అన్నాడు. రూ.87,612 కోట్లు మన రైతన్నలకు రుణాలు మాఫీ అయ్యాయా? అని అడుగుతున్నాను. వీళ్లు చెప్పిన ముఖ్యమైన హామీల్లో రెండో అంశం చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు.. ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా చేశాడా? అని అడుగుతున్నాను.
మూడో ముఖ్యమైన అంశం.. ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. 2014 నుంచి ఆ 5 సంవత్సరాల్లో మీ ఇళ్లలో ఆడబిడ్డలు పుట్టారు కదా.. మీ ఇంటి చుట్టుపక్కల కూడా పుట్టారు కదా.. మరి అందులో ఏ ఒక్కరికైనా కూడా రూ.25 వేల కథ దేవుడెరుగు.. కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా? అని అడుగుతున్నాను. 

ఇంకా ముందుకు పోదామా? ఇంటింటికీ ఓ ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2 వేలు ప్రతి నెలా ఇంటింటికీ నిరుద్యోగభృతి అన్నాడు. 5 సంవత్సరాలు.. 60 నెలలు నెలకు రూ.2 వేల చొప్పున ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు ఇచ్చాడా? అని అడుగుతున్నాను. ఇంకా ముందుకు పోదామా? అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు. కనీసం ఏ పేదవాడికైనపా కూడా ఒక్కటంటే ఒక్క సెంటు స్థలమైనా కూడా ఇచ్చాడా? అని అడుగుతున్నాను. 

ఇంకా ముందుకు పోదామా? రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు. చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీ గుంటూరులో ఏమైనా కనిపిస్తోందా? మీ అందరినీ ఆలోచన చేయమని అడుగుతున్నాను. ముఖ్యమైన హామీలంటూ 2014లో వీళ్లే ముగ్గురూ కలిసి ఒక్కటై చంద్రబాబు నాయుడు గారితో సంతకం పెట్టి, చంద్రబాబు ప్రతి ఇంటికీ పంపించిన పాంప్లెట్ లో ఉన్న ఏ ఒక్కటైనా అమలు అయ్యిందా? అని అడుగుతున్నాను మీ అందరితో. ఈసారి గట్టిగా చెప్పాలి. 

ప్రత్యేక హోదా ఇచ్చాడా? నేను అడుగుతున్నాను. మరి 2014లో ఇదే మాదిరిగా ప్రజల్ని మోసం చేసిన వీళ్లు మళ్లీ ఇదే తీరులోనే 2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాకపోగా, మళ్లీ వీళ్లు ముగ్గురూ కలిసి మళ్లీ ఏకమై ప్రజల్ని మోసం చేసేందుకు కొత్త కొత్త హామీలతో, వాగ్దానాలతో ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తారట. నమ్ముతారా? ప్రతి ఇంటికీ కేజీ బంగారమట. నమ్ముతారా? సూపర్ సిక్స్ అట, సూపర్ సెవెన్ అట. నమ్ముతారా? మరి ఆలోచన చేయమని కోరుతున్నా.మరి వారి మోసాల నుంచి రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా.. ప్రతి ఇంటికీ వెళ్లి నిజాలు చెప్పి స్టార్  క్యాంపెయినర్లుగా ప్రతి ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి వచ్చి జరుగుతున్న మంచి కొనసాగాలంటే మీ బిడ్డ రావాలి. మోసపోకూడదు అంటే.. మీ బిడ్డకే ఓటు పడాలి అని ప్రతి ఇంటికీ వెళ్లి మీరంతా కూడా చెప్పేందుకు సిద్ధమేనా? 

175 కు 175 అసెంబ్లీ, 25 కి 25 ఎంపీ స్ధానాలు గెలవాలి.
మీరు సిద్ధమే అయితే, వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా అసత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జేబుల్లోంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. లైట్ బటన్ ఆన్ చేయండి. పేదల భవిష్యత్ కోసం యుద్ధం చేసేందుకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. ఇది విశ్వసనీయతకు, మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తుమారాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పటళ్లు మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాను గుర్తు మీద రెండు ఓట్లు వేయాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు ఒక్కటంటే ఒక్కటి తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా? 

ఈరోజు మీ అందరితో కూడా జరుగుతున్న మోసాలను ఎరగమని చెప్పి ఈ సందర్భంగా చెబుతున్నాను. ఒక రాజకీయ నాయకుడు మీ ముందర నిలబడితే ఎలాంటి వాడు ఆ రాజకీయ నాయకుడు, ఎలాంటి వాడిని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలంనుకుంటున్నాము అన్న అంశం ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఎందుకు జరగాలో తెలుసా? కారణం.. మనం వేసే ఈ ఓటు రాబోయే మన 5 సంవత్సరాల జీవితం ఆ పాలకుడి చేతిలో పెడుతున్నాం. ఆ పాలకుడు మంచి మనసు ఉండి,మంచి మనకు చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఆ పాలకుడు మోసగాడైతే మన బతుకులు అంధకారమయం అవుతాయి. మన పిల్లల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. అక్కచెల్లెమ్మల బతుకులు అతలాకుతలం అవుతాయి. రైతన్నల జీవితాలు మోసపోయి ఆత్మహత్యలపాలవుతాయి అన్నది, అవ్వాతాతల సంక్షేమం అడుగంటి పోతుందన్న వాస్తవాలు ప్రతి ఇంట్లో కూడా చర్చ జరగాలి. 

మన అభ్యర్ధులను ఆశీర్వదించి గెలిపించండి..

  • ఈ మాట చెబుతూ ఈరోజు మీ అందరికీ కూడా మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మన పార్టీ తరఫున నిలబడబోతున్న మన ఎంపీ అభ్యర్థులను, ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేయబోతున్నాను. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచాల్సిందిగా సవినయంగా వేడుకుంటున్నాను. 
  • ఎంపీ అభ్యర్థిగా రోశయ్య అన్న నిలబడబోతున్నాడు. మీ అందరికీ కూడా తెలిసిన వాడే. రోశయ్య అన్న మంచివాడు, సౌమ్యుడు, మీ అందరి చల్లని దీవెనలు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతున్నాను.
  • గుంటూరు ఈస్ట్ నుంచి నా చెల్లెలు ఫాతిమా నిలబడుతోంది. యువకురాలు, ఉత్సాహవంతురాలు, మంచి చేయడానికి ముందుకు వస్తోంది. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కోరుతున్నాను.
  • ప్రత్తిపాడు నుంచి కిరణ్ నిలబడుతున్నాడు. నా తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి ముందుకొచ్చాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కిరణ్ పై ఉంచవలసిందిగా కోరుతున్నాను.
  • మంగళగిరి నుంచి మీ బిడ్డ, నా చెల్లెలు.. ఎవరితో తలపడుతోందో తెలుసా? మీ బిడ్డకు మీ లోకల్ కు, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అవసరం. ఎందుకంటే ఒక మెసేజ్ పంపించాలి. ఒక ఎమ్మెల్యే అంటే ఈ మాదిరిగా ఉండాలి, అందుబాటులో ఉండే పరిస్థితి కచ్చితంగా ఉండాలి అని చెప్పే మంచి చెల్లెమ్మ లావణ్యమ్మ. కాబట్టి లోకల్ గా మీకు అందుబాటులో ఉన్న మీ నాయకురాలు మంచి చేస్తుందని చెప్పి మనస్పూర్తిగా నేను నమ్మి మీలో ఒకరికి టికెట్ ఇచ్చాను. సంపూర్ణంగా గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి ప్రార్థిస్తున్నాను. 
  • తాడికొండ నుంచి నా చెల్లెలు సుచరితమ్మ నిలబడుతోంది. నా చెల్లి గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ఆశీర్వదించండి. మంచి చేస్తుంది. మీ అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండి తోడుగా ఉంటుంది నా చెల్లి.
  • గుంటూరు వెస్ట్ నుంచి నా మరో చెల్లి రజిని నిలబడుతోంది. స్థానికురాలు, మగవాళ్లకు హీరో అన్న పదం చెబుతారు కానీ, ఏ మాత్రం తగ్గదు. మంచి చేస్తుంది. మంచి కోసం నిలబడుతుంది. మీలో ఒకరు. ఆశీర్వదించమని కోరుతున్నాను. 
  • తెనాలి నుంచి శివ నిలబడుతున్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు శివపై ఉంచవలసిందిగా కోరుతున్నా. శివ నాకు మంచి స్నేహితుడు కూడా. 
  • పొన్నూరు నుంచి మురళి అన్న నిలబడుతున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మురళి అన్నపై ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మంచి చేయడానికి వీళ్లందరూ కూడా ముందుకు వచ్చారు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వీళ్లపై మెండుగా ఉంచవలసిందిగా కోరుతున్నాను. 
  • మన గుర్తు అక్కడో, ఇక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే.. నాకు తెలిసు బాగా ఆలస్యమైందని, ఆలస్యమైనప్పటికీ కూడా పూర్తిగా చైర్ల మీద పైకెక్కి ఉన్నారు. ముందు రోలో ఉన్న వారందరూ కూడా వెనుకనున్న వాళ్లకు కనపడకుండా అడ్డు పడుతున్నారన్న సంగతి కూడా అర్థమవుతోంది. అయినా కూడా ఇక్కడో ఎక్కడో మన ఫ్యాను గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవలసిందిగా కోరుతున్నాను. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు.. ఫ్యాను గుర్తుపై ఉంచి 130 సార్లు మీ బిడ్డ మీ బాగోగుల కోసం బటన్ నొక్కాడు. రాష్ట్రం బాగోగుల కోసం ప్రతి పేదవాడి భవిష్యత్తు కోసం, మీలో ప్రతి ఒక్కరే కాకుండా.. మీరు ప్రతి ఇంటికీ వెళ్లి మరో వంద మందికి చెప్పి.. వాళ్ల చేత కూడా చెప్పించి రాష్ట్ర భవిష్యత్తు కోసం, పేదవాడి భవిష్యత్తు కోసం 2 సార్లు వాళ్లు ఫ్యాను గుర్తు మీద నొక్కాల్సిన అవసరాన్ని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. 
  • బాగా ఆలస్యమైపోయినా కూడా మీ అందరి చల్లని దీవెనలకు, ఆశీస్సులకు మీ బిడ్డ ఎప్పుడూ రుణపడి ఉంటాడని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాగా ఆలస్యం అయిపోయింది కాబట్టి ర్యాంపు మీదకు కూడా సెక్యూరిటీ వాళ్లు ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయిందని చెబుతున్నారు కాబట్టి.. ర్యాంపు కూడా రాలేకపోయినందుకు ఏ ఒక్కరూ కూడా మరోలా మరోలా భావించవద్దు అని కోరుతున్నాను అంటూ సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
     
Back to Top