నిర్మ‌లా సీతారామ‌న్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అనంత‌రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్‌ సమస్యలను నివేదించారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించారు. ప్ర‌త్యేక  హోదా, సవరించిన పోలవరం అంచనాలకు ఆమోదించాల‌ని కోరారు. రెవెన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు, రుణపరిమితి, రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం తదితర అంశాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించారు. 

తాజా వీడియోలు

Back to Top