కేంద్ర ఆర్థిక‌మంత్రితో ముగిసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మావేశం కాసేప‌టి క్రిత‌మే ముగిసింది. సుమారు 45 నిమిషాలపాటు ఈ భేటీ జ‌రిగింది. ఆంధ్ర‌రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై కేంద్ర ఆర్థిక శాఖ‌ మంత్రితో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ర్చించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఉపాధి హామీ, పోలవరం నిధుల విడుదల అంశాలను సైతం భేటీలో ప్రస్తావించారు. 

Back to Top