వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది 

వైయస్‌ఆర్‌ జిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇస్తామని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్‌ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పర్యటించారు. రాజంపేట మండలం మందపల్లి, పులపుత్తూరులో వరద బాధితులను సీఎం వైయస్‌ జగన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో సీఎం వైయస్‌ జగన్‌ ముఖాముఖి నిర్వహించి..వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు అద్భుతంగా పని చేశారని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అభినందించారు. పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top