కాసేపట్లో దేవాలయాల పునర్నిర్మాణానికి భూమిపూజ

వేదమంత్రోశ్చరణల మధ్య శంకుస్థాపన చేయనున్న సీఎం వైయస్‌ జగన్‌

విజయవాడ: టీడీపీ హయాంలో చంద్రబాబు కూల్చేసిన దేవాలయాల పునర్నిర్మాణానికి కాసేపట్లో భూమిపూజ జరుగనుంది. ఉదయం 11.01 గంటలకు వేద మంత్రోశ్చరణల మధ్య ఆ ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునాదిరాయి వేయనున్నారు. కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణ పనులకు సీఎం మరికొద్దిసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు–కేతువు, బొడ్డుబొమ్మ, రాతితో శ్రీశనేశ్వర ఆలయం, శ్రీసీతారామ లక్ష్మణ సమేత శ్రీదాసాంజనేయ స్వామి ఆలయం, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ సమీపంలో వీరబాబు ఆలయం, కనకదుర్గ నగర్‌లో గోశాల, శ్రీవేణుగోపాలకృష్ణ ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ భూమిపూజ చేయనున్నారు. అదే విధంగా రూ.70 కోట్లతో కనకదుర్గమ్మ గుడి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top