సీ హారియర్‌ మ్యూజియంను ప్రారంభించిన సీఎం

విశాఖ‌ప‌ట్నం: వైజాగ్ బీచ్‌రోడ్డులో వీఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన సీ హారియర్‌ యుద్ధ‌ విమాన మ్యూజియంను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మ్యూజియంలో అధికారులతో కలియతిరిగి తిలకించారు. మ్యూజియం ప్ర‌త్యేక‌త‌ల‌ను నేవీ అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాను సైతం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రారంభించారు. 

Back to Top