ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైయ‌స్‌ జగన్‌

 తాడేపల్లి: దుర్గగుడిలో ధర్మపథం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం ధర్మ ప్రచారం కోసమే ప్రత్యేకంగా ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సంద‌ర్భంగా  టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డిలు స్వామివారి ప్ర‌సాదాన్ని అంద‌జేశారు. కార్యక్రమంలో  దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Back to Top