గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆత్మీయ వీడ్కోలు

విజయవాడ: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీపై వెళ్తున్న బిశ్వభూషణ్‌కు గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆత్మీయ వీడ్కోలు ప‌లికారు. ఏపీ గ‌వ‌ర్న‌ర్‌గా బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌ మూడున్నరేళ్ల పాటు కొనసాగారు. వీడ్కోలు కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, గవర్నర్ ముఖ్యకార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎస్పీ జాషువా, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Back to Top