కాపు నేస్తం మాత్రమే కాదు..చేతల ద్వారా కాపు కాస్తున్నాం

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సాయం

లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైయస్‌ జగన్‌

కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన  3,38,792 మందికి రూ.508.18 కోట్ల ఆర్థికసాయం

చంద్రబాబు పాలనలో డీపీటీ అంటే దోచుకో..పంచుకో..తినుకో

మన ప్రభుత్వం డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ

చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియాకు తెలిసిందంతా అవినీతే

ఎవరి పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి

హుద్‌హుద్‌ తుపాను వచ్చినప్పుడు చంద్రబాబు పాచిపోయిన పులిహోర పంచారు

మా హయాంలో విపత్తు వస్తే ప్రతి ఇంటికి రూ.2 వేలు ఇస్తున్నాం 

కాకినాడ‌: కాపు మ‌హిళ‌ల‌కు వైయ‌స్ఆర్ కాపు నేస్తం ప‌థ‌కం మాత్ర‌మే కాద‌ని, వివిధ సంక్షేమ ప‌థ‌కాల ద్వారా చేత‌ల్లో చూపిస్తూ కాపు కాస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. కాపుల‌తో పాటు ప్రతీ సామాజికవర్గ సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం తమదని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైయ‌స్సార్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నామని తెలిపారు.  మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం. మనది రైతు ప్రభుత్వం. మనది పేదలకు మంచి చేసే ప్రభుత్వం. మనది.. అన్నివర్గాల ప్రభుత్వం.. మనసున్న ప్రభుత్వం అని సగర్వంగా చెప్పారు. మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా వైయ‌స్సార్‌ కాపు నేస్తం అందిస్తున్నామని, అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైయ‌స్ జగన్‌ ఉద్ఘాటించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో జరిగిన వైయ‌స్సార్‌ కాపు నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రసంగించారు.  

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

  • ఈ రోజు ఇక్కడ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అక్షరాల ఈ రోజు మూడో ఏడాది 338792 మంది నా అక్కచెల్లెమ్మలకు ఈ రోజు కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్‌ నొక్కి నేరుగా రూ.580 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నా. ఎలాంటి లంచాలు, వివక్షకు తావులేకుండా నేరుగా పంపించే మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నా.
  • మనది అక్కచెల్లెమ్మల ప్రభుత్వమని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు.
  • మనది రైతుల ప్రభుత్వమని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు.
  • మనది పేదల ప్రభుత్వమని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు.
  • మనది వరలు వస్తే..కష్టం వస్తే మనసుతో స్పందించి ప్రతి పేదవాడికి కూడా అండగా ఉండే ప్రభుత్వమని చెప్పడానికి  ఏమాత్రం కూడా సంకోచించడం లేదు. 
  • మనది మనసున్న ప్రభుత్వం కాబట్టి మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకాన్ని మీ కోసం తీసుకువచ్చి ప్రతి కాపు, బలిజ, ఒంటరి తెలుగు మహిళలకు తోడుగా ఉండేందుకు గొప్ప కార్యక్రమాన్ని అమలు చేస్తున్నా.
  • వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆ పేదింటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఒక పథకాన్ని నవరత్నాల్లో భాగంగా ఇస్తూ వాగ్ధానం చేశాం.
  • అదే తరహాలో కాపు అక్కచెల్లెమ్మలకు మద్దతు ఇవ్వాలని భావించి, మేనిఫెస్టోలో చెప్పకపోయినా  వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకాన్ని ప్రారంభించి వరసగా మూడో ఏడాది కూడా నా అక్కచెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా రూ.15 వేల చొప్పున ఇక్కడి నుంచి విడుదల చేస్తున్నా.
  • చాలా మంది అక్కచెల్లెమ్మలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రూ.45 వేలు వారి చేతుల్లో పెట్టాం. వారి కాళ్లమీద వారు నిలబడేలా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా వైయస్‌ఆర్‌ కాపు నేస్తం అమలు చేస్తున్నాం.
  • వైయస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా మొదటి ఏడాది 32,7349 మంది అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.490 కోట్లు ఇచ్చాను. 
  • రెండో ఏడాది 32,744మంది అక్కచెల్లెమ్మలకు మరో రూ.490 కోట్లు ఇచ్చాను. 
  • అర్హత ఉండి కూడా పథకాన్ని పొందలేకపోయిన మరో 1249 మంది అక్కచెల్లెమ్మలకు కూడా ..ఎవరూ మిస్‌ కాకూడదని ఈ నెల 19న వాళ్లకు 1.87 కోట్లు వాళ్ల ఖాతాల్లో జమ చేశాను.
  • ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదన్న తపనా, తాపత్రయంతో అడుగులు వేస్తున్నా.
  • ఈ రోజు వరుసగా మూడో ఏడాది 3,38, 792 మందికి నా అక్కచెల్లెమ్మలకు ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్‌ నొక్కి రూ. 508 కోట్లు జమ చేయనున్నామని సగర్వంగా చెబుతున్నాను. మీ ఇంట్లో మీ బిడ్డగా, మీ అన్నగా తమ్ముడిగా చెబుతున్నాను. 
  • ఒక్క కాపు నేస్తం అన్న పథకం ద్వారా ఈ మూడేళ్లలో మొత్తంగా రూ. 1490 కోట్లు నా అక్కచెల్లెమ్మలకు అందించానని సగర్వంగా తెలియజేస్తున్నాను.
  • నవరత్నాల్లోని మిగిలిన పథకాల ద్వారా ఈ మూడేళ్లలోనే ఒక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీ, కాపు కార్పొరేషన్‌ ద్వారా కలిగిన లబ్ధి రూ.16,256 కోట్లు అని సవినయంగా తెలియజేస్తున్నాను.
  • ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్లు కట్టే కార్యక్రమం, నాన్‌ డీబీటీ పథకాల ద్వారా కాపు అక్కచెల్లెమ్మలకు మరో రూ.16 వేల కోట్లు ఇచ్చాం. ఒ క్కసారి తేడా గమనించండి.
  • ఇళ్ల పట్టాలు, ఇళ్లుకు సంబంధించి 2.46 లక్షల మంది నా కాపు అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల విలువ రూ.12 వేల కోట్లు అవుతుంది.
  • ఇందులో ఇప్పటికే 1.20 లక్షల మందికి ఇల్లు కట్టే కార్యక్రమం మొదలైంది. అక్షరాల రూ.15,334 కోట్లు ఖర్చు చేస్తున్నాడు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు అని సగర్వంగా తెలియజేస్తున్నాను.
  • నాన్‌ డీబీటీతో కలిపి లెక్కెస్తే అక్షరాల రూ. 16,040 కోట్లు అవుతుంది. మొత్తంగా నా అక్కచెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు ఈ మూడేళ్లలోనే అక్షరాల రూ.32,296 కోట్లు అని సవినయంగా, సగర్వంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి తేడా గమనించమని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను.
  • కాపులకు ప్రతి ఏటా రూ. వెయ్యి కోట్లు బడ్జెట్‌ పెడతానని ఆ రోజు చెప్పిన చంద్రబాబు..ఐదేళ్లలో 1500 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితిని గుర్తుకు తెచ్చుకోవాలని కోరుతున్నాను.
  • చంద్రబాబు చేసిన అనేక అబద్ధాలు, మోసాల మాదిరిగా ఇది కూడా ఒకటి.
  • మనం మేనిఫెస్టోలో చేసిన వాగ్ధానం..ప్రతి ఏటా రూ.2 వేల కోట్లు ఇస్తామని, ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు లబ్ధి చేస్తామని మనం చెబితే..ఈ రోజు మూడేళ్లలకే రూ.32.296 కోట్లు ఇవ్వగలిగానని మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా సవినయంగా, సగర్వంగా చెబుతున్నాను. మనసుతో పరిపాలన చేస్తున్నానని చెబుతున్నాను. ఇది మన ప్రభుత్వం పేదవారిపై చూపుతున్న శ్రద్ధ, చిత్తశుద్ది.
  • కాపులకు నేస్తం మాత్రమే కాదు..చేతల ద్వారా కాపు కాస్తున్నామని చేతల ద్వారా చూపించాం.
  • గతంలో ఒక కులానికి, ఒక సామాజిక వర్గానికి ఆ ప్రభుత్వం ఏమి చేసిందని చెప్పేందుకు బడ్జెట్‌లో లెక్కలు మాత్రమే చెప్పేవారు. ఈ లెక్కలు చూసి ఆ కులాలు ఏమనుకునేవారో తెలుసా..బడ్జెట్లో ఇన్ని వందలు, వేల కోట్లు చెప్పారు. కానీ నాకు ఏ మేలు చేయలేదని చెప్పుకునేవారు. పేదవాడైన నాకు రాకుండా ఎవరికి ఇచ్చారని, ఈ లెక్కలన్నీ కూడా మాయాజాలమని చెప్పుకునేవారు. 
  • ప్రతి పేద కుటుంబం మా పేరుతో పద్దు రాసుకుంటున్నారు. కానీ మాకు ఇచ్చింది ఏమీ లేదని గతంలో చెప్పుకునే వారు. గతంలో బడ్జెట్‌ చూస్తే ఎవరైనా  ఇలాగే అనుకునేవారు.
  • మన ప్రభుత్వం వచ్చాక బడ్జెట్‌ అంకెలు మాత్రమే కాదు. ఒక కులానికి జరిగిన మేలు మాత్రమే కాదు. ఒక జిల్లాలో అందరికీ జరిగిన మేలు మాత్రమే కాదు. ఒ క గ్రామంలో జరిగిన మంచి మాత్రమే కాదు. ఈ మూడేళ్లలో ప్రతి కుటుంబానికి, అందులోనూ ప్రతి ఒక్కరికి, ఇంటింటికీ వెళ్లి మీ కుటుంబానికి ఈ పథకాలు అందాయా, ఈ మేలు జరిగిందని మన పార్టీకి ఓటు వేయని వారికి కూడా మంచి చేశామని తలుపు తట్టి ప్రతి అక్కకు చూపించి, వారి ఆశీర్వాదాలు కోరేందుకు మన ప్రతినిధులు గడప గడపకు వెళ్తున్నారు.
  • అక్కా..మీ కుటుంబానికి మంచి జరిగితేనే అన్నను ఆశీర్వదించండి.  మమ్మల్ని ఆశీర్వదించమని ప్రతి ఎమ్మెల్యే గడప గడపకు వచ్చి మీ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇలాంటి పాలన దేశంలో ఎక్కడైనా ఉందా?
  • గతంలో మాదిరిగా ఏ  కొద్దిమందికి మాత్రమే ఇవ్వడం. అది కూడా జన్మభూమి కమిటీలు చెబితేనే ఇచ్చే పరిస్థితి కాకుండా, వెయ్యి మంది ఉంటే ఏ  ఒక్కరికో ఇద్దరికో ఇచ్చి చేతులు దులుపుకునే గతం మాదిరి పరిస్థితి ఇప్పుడు లేదు.
  • చంద్రబాబు ఏం చెప్పినా, ఆయన తానా అంటే ఎల్లో మీడియా తందానా అంటూ ఆయన్ను నెత్తికి ఎత్తుకుని డబ్బా కొట్టేది. ఒక్కసారి ఆలోచన చేయండి. 
  • ఎంత మంది అర్హులు ఉంటే అంత మందికి ఈ రోజు మంచి జరుగుతోంది.
  • ఏ స్థాయిలో మంచి జరుగుతుందంటే..కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడటం లేదు. వర్గం చూడటం లేదు. చివరికి ఏ పార్టీ అని చూడకుండా, గత ఎన్నికల్లో మనకు ఓటు వేసినా, వేయకపోయినా పట్టించుకోకుండా అర్హత ఒక్కటే ప్రమాణికంగా తీసుకొని మంచి చేస్తున్నాం. 
  • మన పాలనలో ఎక్కడా వివక్ష లేదు. లంచాలు లేవు. సోషల్‌ ఆడిట్‌ కోసం ప్రతి గ్రామ సచివాలయంలో జాబితాను ప్రదర్శిస్తున్నాం. 
  • మనం బటన్‌ నొక్కిన వెంటనే డెరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకి డబ్బు వెళ్తోంది.
  • గతంలో చంద్రబాబు పాలనలో డీపీటీ పథకాలు ఉండేవి. దోచుకో..పంచుకో..తినండి అన్నట్లుగా పాలించే వారు.
  • చంద్రబాబు..తన దుష్ట చతుష్టయం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వారికి తోడు చంద్రబాబు దత్తపుత్రుడు. వీరందరూ కూడా కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకోవడం, పంచుకోవడం, తినుపో..గతానికి ఇప్పటికీ తేడా చూడండి.
  • ఇంటింటికీ అందుతున్న సంక్షేమ పథకాలు రద్దు చేయాలని టీడీపీ అంటోంది. ఆయన దుష్ట చతుష్టయం కూడా రాష్ట్రం మరో శ్రీలంక అవుతుంది. వైయస్‌ జగన్‌ పాలనలో డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగామంచి చేస్తున్నారని వెటకారం చేస్తూ మాటలు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి.
  • రాష్ట్రంలో ఏ పథకం కావాలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. మనందరి ప్రభుత్వం  ఇస్తున్న డీబీటీ పథకం ద్వారా నేరుగా లంచాలు లేకుండా బ్యాంకులో జమ అవుతున్న పథకాలు కావాలా? గతంలో చంద్రబాబు అమలు చేసిన డీపీటీ అంటే దోచుకో..పంచుకో..తినుకో అన్న పథకాలు కావాలో మీరే ఆలోచన చేయండి.
  •  మన పాలన మాదిరిగా వందల సామాజిక వర్గాలు బాగు కావాలా? లేక గత పాలన మాదిరిగా కేవలం చంద్రబాబు, తన దుష్టచతుష్టయం, వా రి దత్తపుత్రుడు బాగుపడే పాలన కావాలో ఆలోచన చేయండి.
  • ఎన్నికల మేనిఫెస్టోలో 95 శాతం వాగ్ధానాలు అమలు చేశాం. ప్రతి ఇంటికి వెళ్తున్నాం..అక్కా మీకు మంచి జరిగితేనే, లబ్ధి పొందితేనే మన ప్రభుత్వాన్ని దీవించండి అని నిజాయితీతో కూడిన రాజకీయాలు మీకు కావాలా?
  • మోసం, వంచనతో కూడా రాజకీయాలు కావాలా? మేనిఫెస్టోలో చెప్పిన వాగ్ధానాలు ఎన్నికలు అయిపోయిన తరువాత చెత్తబుట్టలో వేసి, ఆ  మేనిఫెస్టోలో చెప్పినవి 10 శాతం కూడా అమలు చేయని పచ్చి అబద్ధాల మార్కు చంద్రబాబు రాజకీయం కావాలో ఆలోచన చేయండి. ప్రతి ఇంటా కూడా చర్చ జరగాలి.
  • కాపులకైనా, ఏ కులం వారికైనా, ఏ పేదింటి వారికైనా, ఇంటింటికీ, మనిషి మనిషికి మంచి జరిగిస్తున్న మీ అన్న పాలన, తమ్ముడి పాలన కావాలా అన్నది ఒక్కసారి గుండెలపై చేతులు పెట్టుకొని ఆలోచన చేయాలి.
  • రాజకీయాలు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ రోజు ఇంటింటా ఉన్న కాపుల ఓట్లను  కొంత మేరకు కూడా మూట కట్టి వాటన్నింటిని హోల్‌సెల్‌గా చంద్రబాబుకు అమ్ముకుని దోచుకో..పంచుకో..తినుకో అన్న దత్తపుత్రుడి రాజకీయం కావాలా?
  • వీళ్ల మాదిరిగా నాకు దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తోడుగా ఉండకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నా.. 
  • వీళ్లకు లేనిది, నాకు ఉన్నది మీ దీవెనలు,దేవుడి ఆశీస్సులు అని కచ్చితంగా చెబుతున్నాను. ఒక్కసారి తేడా గమనించండి.
  • గతంలో కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్‌..అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ లేడు. తేడా ఏంటంటే కేవలంముఖ్యమంత్రి మాత్రమే మారాడు. పేదలకు ఇన్ని పథకాలు అప్పుడు ఎందుకు ఇవ్వలేదు. ఇవాళ మీ బిడ్డ పేదలకు ఎలా ఇస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. 
  • కారణం ఒక్కటే..ఇవాళ మీ బిడ్డ బటన్‌ నొక్కి ఎలాంటి వివక్ష, లంచాలు లేకుండా నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. 
  • మరి ఆ రోజు బటన్‌ నొక్కేది లేదు. ప్రజలకు ఇచ్చేది లేదు. దోచుకో..పంచుకో..తినుకో అన్న ఒకే ఒక్క స్కీమ్‌ ఉండేది.  ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరిని కోరుతున్నా..
  • ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంకా మంచి జరగాలని, వారి కాళ్లపై నిలబడే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నాను.
  • ఈ రోజు రాజకీయాలు, అబద్ధాలు ఏ స్థాయికి దిగజారిపోయాయంటే ఒక్కొక్కసారి నిజంగా బాధనిపిస్తోంది. నిన్న చంద్రబాబు అనే వ్యక్తి పేపర్‌ పట్టుకొని చూపించాడు. హుద్‌హుద్‌ తుపాను సమయంలో ఇంటింటికీ రూ.4 వేలు ఇచ్చానని చెప్పాడు. వైయస్‌ జగన్‌ ఈ రోజు రూ.2 వేలు మాత్రమే ఇచ్చారని చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు.
  • నిజంగా చంద్రబాబు మాటలు పచ్చి అబద్ధం. ఆ రోజు హుద్‌హుద్‌ తుపాను సమయంలో నేను ఉత్తరాంధ్ర జిల్లాల్లో 11 రోజులు తిరిగాను. వాళ్లు ఇచ్చింది పాచిపోయిన పులిహోరా ప్యాకెట్లు, అక్కడక్కడ 10 కేజీల రేషన్‌ బియ్యం. ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆ తుపానే కాదు. ఏ తుపానులోనూ ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు.
  • ఈ రోజు తుపాను వచ్చినా, వరద వచ్చినా మొహరిస్తున్నాం. కలెక్టర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు అండగా నిలుస్తున్నారు.
  • ప్రతి ఒక్కరికి 25 కేజీల రేషన్, ప్రతి ఇంటికి రూ.2 వేలు ఇస్తున్నాం. ఈ రోజు మానవత్వంలో ఇస్తున్నాం కాబట్టి..ఈ రోజు చంద్రబాబు ఒక్కరిని కూడా చూపించలేకపోతున్నాడు. జగనన్న పాలనలో నాకు పరిహారం అందలేదని ఏ ఒక్కరూ చెప్పడం లేదు. 
  • ఈ పెద్దమనిషి ఈ రోజు చేతిలో కాగితాలు పట్టుకొని, ప్రజలకు గుర్తు ఉండదని ఆ రోజు నాలుగు వేలు ఇచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నాడు. నిజంగా చంద్రబాబు మనిషేనా అని అనిపిస్తోంది.వీరికున్న అహంకారం ఏంటో తెలుసా..ఏ అబద్ధం చెప్పినా ప్రజలను నమ్మించగలం. కారణం ఏంటంటే పత్రికలు వాళ్లవే, టీవీలువాళ్లవే. చర్చ జరిపేది వాళ్లే..చర్చ జరిగించేది వాళ్లే. కాబట్టి ఏం చెప్పినా కూడా ప్రజలను మోసగించవచ్చు అన్నది వాళ్ల ధీమా. 
  • వాళ్లకు లేనిది, నాకు ఉన్నది ..ఇంటింటికీ మంచి చేశాననే చిత్తశుద్ది నాకుంది. ఇంటింటిలో ఉన్న అక్కచెల్లెమ్మలు నాకు తోడుగా ఉంటారన్న భరోసా నాకుంది. ఆ దేవుడి దీవెనలపై నాకు నమ్మకం ఉంది. 
  • మంచి జరగాలని మనసారా ప్రార్థిస్తూ..మీరు చూపిస్తున్న అనురాగం, ఆప్యాయతలను నా మనసులో ఎల్లప్పుడు పెట్టుకొని పోతానని సవినయంగా తెలియజేస్తూ వైయస్‌ఆర్‌ కాపు నేస్తం పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభిస్తూ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి  డబ్బులు జమ చేశారు. 

  •  
Back to Top