వైయస్‌ఆర్ జిల్లా: బద్వేలులో పలు అభివృద్ధి పనులకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రెండో రోజూ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బద్వేలులో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ సభలో సీఎం వైయస్ జగన్ ప్రసంగిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఎర్రముక్కపల్లెలోని సీపీ బ్రౌన్ రీసెర్చ్ సెంటర్‌కు చేరుకుని బ్రౌన్ విగ్రహాన్ని ఆవిష్కరించి, సీపీ బ్రౌన్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలోని మహావీర్ సర్కిల్‌కు చేరుకుని శిలాఫలకాలను ఆవిష్కరించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడ నుంచి వైయస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం చేరుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి దివంగత వైయస్ రాజారెడ్డి, వైయస్ రాజశేఖర్‌రెడ్డిల విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.