ఎనిమిది జిల్లాల్లో క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు స‌డ‌లింపు

తాడేపల్లి: క‌రోనా నివార‌ణ‌, నియంత్ర‌ణ చ‌ర్య‌లు, వ్యాక్సినేష‌న్‌పై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్న‌తాధికారుల‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో క‌ర్ఫ్యూ అమ‌లుపై చ‌ర్చించారు. క‌రోనా పాజిటివిటీ రేట్ 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉన్న 8 జిల్లాల్లో క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు స‌డ‌లిస్తూ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు.  క‌రోనా పాజిటివిటీ రేట్ త‌క్కువ‌గా ఉన్న జిల్లాల్లో ఉదయం 6 గంట‌ల నుంచి రాత్రి 9 వరకూ కర్ఫ్యూ సడలింపు ఉండనుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ యధావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుంది. 

క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు సడలింపు జిల్లాలివే..
అనంతపురం
కర్నూలు
గుంటూరు
విజయనగరం
విశాఖపట్నం
వైయ‌స్ఆర్ కడప
నెల్లూరు
శ్రీకాకుళం

తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు ఉంటుంది. ఈజిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి జూలై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తిస్తాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక 5 జిల్లాల్లో సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top