మంత్రి పెద్దిరెడ్డి, అధికారుల‌కు సీఎం అభినంద‌న‌లు

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సెర్ప్‌ సీఈఓ ఇంతియాజ్‌ అహ్మద్ తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో వైయ‌స్‌ఆర్‌ చేయూత, వైయ‌స్‌ఆర్‌ ఆసరా పథకాల ద్వారా పేదల సుస్ధిరాభివృద్ధి కోసం సెర్ప్‌(గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ) చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. స్కోచ్‌ అందించిన గోల్డ్‌ అవార్డులను సీఎంకు చూపించారు. ఈ మేర‌కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, సెర్ప్ సీఈఓలను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. 

తాజా ఫోటోలు

Back to Top