సైరస్‌ మిస్త్రీ మృతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

తాడేప‌ల్లి: టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ అకాల మరణం పట్ల ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. మిస్త్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సైరస్‌ మిస్త్రీ ఒక ఆశాజనక వ్యాపార దిగ్గజమని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ కొనియాడారు. టాటా సన్స్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ (54) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆదివారం మరో ముగ్గురితో కలిసి అహ్మదాబాద్‌ నుంచి ముంబై వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 

తాజా వీడియోలు

Back to Top